బ్లూటూత్ ఆధారంగా పనిచేసే కాంపాక్ట్ స్పీకర్లకు ఇటీవలి కాలంలో డిమాండ్ బాగా పెరుగుతున్నది. సింపుల్‌గా ఉండటం.. ఎక్కడికైనా తీసుకెళ్లే సౌలభ్యం వీటి ప్రత్యేకత. శ్రావ్యమైన సంగీతాన్ని కూడా అందిస్తుండటంతో.. వీటిని కొనేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అలాంటి సంగీతప్రియుల కోసం ‘రాప్స్’ సంస్థ.. ‘రాక్-్రగ్లిట్స్’ పేరుతో పోర్టబుల్ స్పీకర్‌ను తయారుచేసింది. ఈ స్పీకర్ చూడటానికి 1980ల పోర్టబుల్ రేడియోలా కనిపిస్తుంది. బ్లూటూత్ 5.0తో.. స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్ కోసం స్పీకర్ఫోన్గానూ పనిచేస్తుంది. అధునాతన ఎయిర్‌ఫ్లో టెక్నాలజీ ద్వారా శక్తిమంతమైన ఆడియోను అందిస్తుంది. ఇందులో 1800 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఎనిమిది గంటలపాటు నిరాటంకంగా ఇష్టమైన పాటలను వినొచ్చు. అంతేకాదు.. దీనితోపాటు వైర్లెస్ మైక్ కూడా లభిస్తుంది. ఆరుబయట పార్టీలకు, స్నేహితులతో కలిసి పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయడానికి ఇది మంచి ఎంపిక. చిక్ వైట్, వైబ్రెంట్ పింక్ రంగుల్లో లభించే ఈ ట్రెండీ బ్లూటూత్ స్పీకర్ ధర. రూ. 1,999. rapz.inద్వారా ఆర్డర్ ఇవ్వవచ్చు.
ఈతరం భద్రతతోపాటు సౌలభ్యానికీ పెద్దపీట వేస్తున్నది. ముఖ్యంగా ఆధుఆధునిక గృహ సంరక్షణలో స్మార్ట్ తాళాల వాడకం పెరుగుతున్నది. నిన్నమొన్నటి దాకా వేలి ముద్రలతో తెరుచుకునే స్మార్ట్లాక్లు ఉండగా.. ఇప్పుడు చేతిని స్కాన్‌చేసి, అన్‌లాక్ చేసే ఆధునిక తాళాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫిలిప్స్.. ఈరకం ‘పామ్ ఐడీ’తో పనిచేసే స్మార్ట్ తాళాలను రూపొందించింది. ‘పామ్ రికగ్నిషన్ స్మార్ట్ డెడ్‌బోల్ట్’గా పిలిచే ఈ లాక్.. అరచేతిని స్కాన్ చేయడం ద్వారా డోర్‌ను అన్‌లాక్ చేస్తుంది. పిన్ నెంబర్, తాళం, ఫిలిప్స్ హోమ్ యాక్సెస్ యాప్ ద్వారా కూడా డోర్‌ను అన్‌లాక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో ఇన్‌బిల్ట్ వైఫై ఉంటుంది. మీరు ఎక్కడినుంచైనా.. మీ ఇంటిని లాక్/ అన్‌లాక్ చేసే అవకాశం కల్పిస్తుంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తోనూ పనిచేసే ఈ స్మార్ట్ లాక్ ధర.. రూ. 30,000.
usa.philips.comలో లభిస్తుంది.
ప్రకృతిని పరిరక్షించేలా.. రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేలా జపాన్‌కు చెందిన ‘ఆసిక్స్’ సంస్థ ‘నింబస్ మిరాయ్’ మోడల్ బూట్లను తయారుచేసింది. వీటిని ఉపయోగించడం అయిపోయిన తర్వాత.. అంటే, పాడైన తర్వాత మళ్లీ తమకు అప్పగించాలని కోరుతున్నారు సంస్థ ప్రతినిధులు. పాత బూట్లను రీసైక్లింగ్ చేసి.. ఆ మెటీరియల్‌తోనే మళ్లీ కొత్తవి తయారుచేస్తారట. చెరుకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో మిగిలిపోయిన వ్యర్థాల నుంచి ఈ బూట్ల సోల్‌ను తయారుచేశారు. పైభాగం కోసం పూర్తిగా పాలిస్టర్నే ఎంచుకున్నారు. ఇక ఈ బూట్లలో వాడిన జిగురును కూడా సులభంగా రీసైకిల్ అయ్యేలా ప్రత్యేకంగా తయారుచేశారు. దీంతో ఈ బూట్లలోని మొత్తం మెటీరియల్‌లో 87.3% తిరిగి వాడుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 2,390 కోట్ల జతల బూట్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో 95% వృథాగా.. కాలుష్యకారకాలుగా మిగిలిపోతున్నాయి. ‘మిరాయ్’ బూట్లు ఈ సమస్యకు పరిష్కారం చూపనున్నాయి. వీటి ధర.. రూ.15,000. asics.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
‘కాల్బోర్’ సంస్థ తయారుచేసిన ‘ఎయిర్ మ్యాక్స్ ఏ1’ మినీ జెట్ ఫ్యాన్ ఒక్కటి చాలు.. ఎన్నో పనులు చేసి పెట్టడానికి. మీకోసం పర్సనల్ ఫ్యాన్‌గా పనిచేస్తుంది. కరెంటులేని సమయంలో మిమ్మల్ని ఉక్కబోతల ఉక్కిరిబిక్కిరి నుంచి బయటపడేస్తుంది. ఓవర్ హీట్ అయిన ఎలక్ట్రానిక్ పరికరాలను చల్లబరుస్తుంది. ల్యాప్‌టాప్, కీబోర్డు, కెమెరాలాంటి ఎలెక్ట్రానిక్ పరికరాల్లో పేరుకుపోయిన దుమ్ము దులపడానికీ పనికి వస్తుంది. జుట్టును ఆరబెట్టుకునే డ్రై క్లీనర్‌గానూ మారిపోతుంది. అరచేతి పరిమాణంలో ఉండే ఈ మినీ ఫ్యాన్.. శక్తిమంతమైన 60 వాట్స్ అవుట్‌పుట్ అందిస్తుంది. 310 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ మినీ ఫ్యాన్‌లో 1100 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటుచేశారు. ఒక్కసారి చార్జ్ చేస్తే.. 15 నిమిషాలపాటు పనిచేస్తుంది. ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియంతో తయారైన ఈ పరికరం ధర.. రూ.4,500. colborlight.com తోపాటు ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో అందుబాటులో ఉన్నది.