Naya Mall | భారత్‌లో మగవాళ్లు మురిపెంగా పెట్టుకునే కడాన్ని తయారు చేసిన ఇటాలియన్ కంపెనీ
స్టడీ టేబుల్ పిల్లలకు ఇష్టమే కాదు అవసరం కూడా. అందుకే వివిధ కంపెనీలు తమదైన శైలిలో దీన్ని తయారు చేస్తుంటాయి. ఇటీవల స్మార్ట్స్టర్స్ సంస్థ కూడా చిన్నారులకు నచ్చేలా ‘ద రాక్‌స్టర్' పేరిట స్టడీ టేబుల్ తయారు చేసింది. అవసరమైనవి పిన్ చేసుకునేందుకు సాఫ్ట్‌బోర్డ్, నచ్చినవి రాసుకునేందుకు వైట్ బోర్డ్ ఏర్పాటు చేసింది.
Naya Mall | సంప్రదాయానికి ఆధునికత కలబోయడం నేటి నగల ట్రెండ్. ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ సంస్థ బుల్గరి ఇటీవల భారత్‌లో మగవాళ్లు మురిపెంగా పెట్టుకునే కడాను తనదైన శైలిలో తయారు చేసింది. సంస్థ సిగ్నేచర్ మోడల్లో ‘బీజీరో1 కడా బ్రేస్లెట్’ను ఇండియా ప్రత్యేక కలెక్షన్గా తీసుకొచ్చింది. భారతీయులు ఇష్టంగా ధరించే పసుపు పచ్చ బంగారంతోనే దీన్ని రూపొందించారు. మధ్యలో గీతలా వచ్చి అటూ ఇటూ ఉబ్బెత్తుగా ఉండే ఈ మోడల్ మామూలు కడాకన్నా కాస్త వెడల్పుగా కనిపిస్తుంది. దీన్ని వాచీ లేదా వేరే బ్రేస్లెట్లతో కలిపి ధరించవచ్చు. ఒక్కటిగానూ పెట్టుకోవచ్చు. అదనపు వివరాల కోసం సంస్థ వెబ్సైట్ చూడొచ్చు. ధర 12 లక్షల పైమాటే!
చోటా రాక్‌స్టార్
స్టడీ టేబుల్ పిల్లలకు ఇష్టమే కాదు అవసరం కూడా. అందుకే వివిధ కంపెనీలు తమదైన శైలిలో దీన్ని తయారు చేస్తుంటాయి. ఇటీవల స్మార్ట్స్టర్స్ సంస్థ కూడా చిన్నారులకు నచ్చేలా ‘ద రాక్‌స్టర్’ పేరిట స్టడీ టేబుల్ తయారు చేసింది. అవసరమైనవి పిన్ చేసుకునేందుకు సాఫ్ట్‌బోర్డ్, నచ్చినవి రాసుకునేందుకు వైట్ బోర్డ్ ఏర్పాటు చేసింది. బ్యాగులు, పుస్తకాలు, బొమ్మలు సర్దుకునేందుకు జాగా కూడా ఉంటుంది. టేబుల్, కుర్చీల అంచులు గుచ్చుకుని గాయాలు కాకుండా మూలల్ని సున్నితంగా డిజైన్ చేశారు. నీళ్లు తగిలితే పాడవుతుందనే భయం లేదు. చెదలు పట్టే సమస్యే లేదు. గదికి కొత్త అందం తెచ్చేలా రకరకాల రంగులు, డిజైన్లలో వస్తున్నాయి. smartsters.in లో ఆర్డర్ చేయొచ్చు. ధర సుమారు ఎనిమిది వేల రూపాయలు.
మ్యాక్సీ కట్స్…
మ్యాక్సీ డ్రెస్సుల్లాగే మ్యాక్సీ స్కర్ట్లు కూడా ఫ్యాషన్ లిస్టులో ఎప్పుడూ ఉంటాయి. వాటికి జతచేసే టాప్‌ను బట్టి ఒక్కోసారి ఒక్కోలుక్లో కనిపించేలా చేస్తాయి. ఇటలీకి చెందిన ఫ్యాషన్ సంస్థ బ్రూనెల్లో కుచినెల్లి… గోన్నా పేరిట ఇటీవల మ్యాక్సీ స్కర్ట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. నడుం దగ్గర కుచ్చులతో మడమల దాకా వచ్చిన ఈ మిక్స్డ్ కాటన్ స్కర్ట్‌కు కాళ్ల దగ్గర కట్స్ ఇచ్చారు. ఫ్యాషన్ లుక్‌లో కనిపిస్తూనే నడిచేందుకు సౌకర్యంగా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. నడుం దగ్గరి బెల్టు పట్టీలు, పాకెట్స్ మీదా మోనిలి బీడ్స్ జోడించి స్కర్ట్‌కు ప్రత్యేకతను తీసుకొచ్చారు. net-a-porter.com లో దీన్ని ఖరీదు చేయొచ్చు. వెల సుమారు లక్షా పాతికవేల రూపాయలు.
చిన్న చిన్న వాచీ..
చేతి గడియారాలకు పెద్ద పెద్ద డయల్స్ ఇష్టపడేవారు ఎంత మందో, చిన్న చిన్న వాటిని ప్రేమించేవారూ అంతే మంది. చిన్నగా ఉండే డయల్సే తమ ఫ్యాషన్ స్టేట్మెంట్ అనుకునేవాళ్లూ కనిపిస్తారు. అలాంటి అభిరుచి ఉన్నవారి కోసం లాంజీన్ సంస్థ ‘మినీ డాల్చేవీటా’ కలెక్షన్ తీసుకొచ్చింది. చిన్నసైజులో ఉండే నాలుగు పలకల డయల్ లోపల గంటలు, నిమిషాల ముల్లుతో పాటు సెకన్లను తెలిపే మరో చిన్న గడియారమూ ఉంటుంది. నీలం, గులాబీ, ఆకుపచ్చ రంగులతో పాటు వెండి మెరుపులతోనూ ఈ కలెక్షన్ తీసుకొచ్చారు. మొసలి చర్మం తరహా గీతల స్ట్రాప్‌కు ఆ రంగుకు మ్యాచ్ అయ్యేలా డయల్ రంగునూ డిజైన్ చేశారు. వజ్రాలు పొదిగిన డయల్ ప్రత్యేకత.longines.comలో ఆర్డర్ చేయవచ్చు. ఖరీదు మూడు లక్షలా నలభై వేలు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

