వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో ఓ మంచి పోర్టబుల్ గొడుగు చేతిలో ఉండాల్సిందే! Kerok Portable Auto Travel Umbrella.. ప్రయాణాలకు, రోజువారీ వాడకానికి అనుకూలంగా ఉంటుంది. కాంపాక్ట్ సైజులో ఉండే ప్రీమియం ఫోల్డింగ్ గొడుగు ఇది. ఆఫీస్ బ్యాగుల్లో, కార్లలో, చిన్న ట్రావెల్ బ్యాగులోనూ సులభంగా ఇమిడిపోతుంది. దీని హ్యాండిల్‌పై ఉండే వన్ టచ్ బటన్ ద్వారా గొడుగును ఒకే చేతితో సులభంగా ఓపెన్/ క్లోజ్ చేయొచ్చు. కెరోక్ గొడుగులో బలమైన ఫ్రేమ్, రిబ్స్ వాడటం వల్ల, గట్టి గాలి వానలను సైతం తట్టుకుని స్థిరంగా ఉంటుంది. మడతపెట్టినప్పుడు చిన్న పరిమాణానికి వచ్చేస్తుంది. కాబట్టి, ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లడం సులభం. దీని ప్రత్యేక ఫ్యాబ్రిక్ వల్ల గొడుగు త్వరగా ఆరిపోతుంది.
ధర : రూ.299
దొరుకుచోటు: అమెజాన్

భారీ స్క్రీన్ మీద గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్ పొందాలనుకుంటే.. ROG XREAL R1 ను ఓసారి ట్రై చేయాల్సిదే! ప్రఖ్యాత ఆసుస్ రోగ్ సంస్థ.. ఎక్స్ రియల్‌తో కలిసి ఈ అత్యాధునిక ఏఐ గ్లాసెస్‌ను తీసుకొచ్చింది. ఇవి ప్రపంచంలోనే మొదటి 240Hz ఏఆర్ గ్లాసెస్. దీనివల్ల అత్యాధునిక, హై రిజల్యూషన్ గేమ్స్ ఆడేటప్పుడు విజువల్స్ అత్యంత స్మూత్‌గా ఉంటాయి. మోషన్ బ్లర్ అనేది అస్సలు ఉండదు. ఈ గ్లాసెస్ పెట్టుకోగానే కళ్ల ముందు 171 అంగుళాల భారీ థియేటర్ లాంటి స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది. దీని 57 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ.. మనిషి కంటి చూపులోని 95 శాతం ఫోకస్ ఏరియాను కవర్ చేస్తుంది. ఈ గ్లాసెస్తోపాటే వచ్చే ప్రత్యేకమైన కంట్రోల్ డాక్‌తో పీసీ, గేమింగ్ కన్సోల్కు కనెక్ట్ అవ్వొచ్చు. ఇందులోని ఎలక్ట్రోక్రోమిక్ లెన్స్ టెక్నాలజీ ద్వారా బయట ఉన్న వెలుతురును బట్టి గ్లాసెస్ టింట్ లెవెల్ అడ్జస్ట్ అవుతుంది. దీని బరువు కేవలం 91 గ్రాములు మాత్రమే. ఎక్కువ సమయం గేమింగ్ చేసినా ముక్కు, చెవులపై భారం అనిపించదు.
ధర: రూ.95,000
దొరుకుచోటు: rog.asus.com

టెక్ లవర్స్ కోసం యాంకర్ సంస్థ సరికొత్త Anker Nano Charging Station (45W)ను తీసుకొచ్చింది. మామూలు చార్జర్లకు భిన్నంగా.. ఓ బుల్లి స్క్రీన్‌తో వస్తుంది. ఈ ఎల్సీడీ డిస్ప్లే.. చార్జర్ పనిని రియల్ టైమ్‌లో చూపిస్తుంది. ఫోన్, ల్యాప్‌టాప్ ప్రస్తుతం ఎన్ని వాట్ల వేగంతో చార్జ్ అవుతుందో స్క్రీన్‌పై లైవ్‌గా కనిపిస్తుంది. ఎంతవరకు చార్జ్ అయింది, ఇంకా ఎంత సమయం పడుతుంది? అనేది కూడా చూపిస్తుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నా, ఓవర్-హీట్ అవుతున్నా స్క్రీన్ ద్వారానే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఇక ఇందులోని స్మార్టర్ చార్జింగ్ లాజిక్‌తో మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తుంది. ఒకేసారి రెండు వేర్వేరు డివైజ్‌లకు చార్జ్ చేస్తుంటే.. ఏ డివైజ్‌కు ఎంత పవర్ కావాలో ఈ స్మార్ట్ లాజిక్ స్వయంగా నిర్ణయించుకుని, పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మామూలు చార్జర్లలా ఫిక్స్డ్ పవర్ కాకుండా.. అవసరాన్ని బట్టి పవర్‌ను మారుస్తుంది. ఫోన్ 80శాతం చార్జింగ్కు చేరుకోగానే స్పీడ్‌ను తగ్గించి, బ్యాటరీ లైఫ్ పాడవకుండా కాపాడుతుంది. చార్జర్లలోనూ కొత్తదనం కోరుకునేవారికి ఇది మంచి చాయిస్.
ధర: రూ.8,833
దొరుకుచోటు: అమెజాన్

పుస్తకాలు ఎక్కువగా చదువుతారా? ప్రతి విషయాన్నీ నోట్స్‌గా రాసుకునే అలవాటు ఉన్నదా? అదే సమయంలో.. ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్ల డిజిటల్ ఫెటిగ్ నుంచి దూరంగా, ప్రశాంతంగా పని చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, reMarkable Paper Pro మీకు మంచి ఆప్షన్. డిజిటల్ రైటింగ్ ట్యాబ్లెట్ల ప్రపంచంలో ఇదో సంచలనం. ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్కే పరిమితమైన రిమార్కబుల్.. ఇందులో కలర్ స్క్రీన్‌ను పరిచయం చేసింది. ఇందులోని ‘కాన్వాస్ కలర్’ టెక్నాలజీ.. కళ్లకు ఏమాత్రం శ్రమ లేకుండా, నిజమైన కాగితంపై రంగులతో రాస్తున్న అనుభూతిని ఇస్తుంది. 11.8 అంగుళాల పెద్ద డిస్ప్లే.. ఫైల్స్ చదవడానికి, నోట్స్ రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. టైప్ కూడా చేయాలనుకుంటే, దీనికి కీబోర్డ్ ఉన్న ‘టైప్ ఫోలియో’ కవర్‌ను విడిగా
జతచేసుకోవచ్చు.
ధర: రూ.84,999
దొరుకుచోటు: అమెజాన్