రైల్వే లైను పక్కన కట్టిన గృహాలను కొనొచ్చా?
గృహాలు అన్నీ మనవే కాబట్టి, మనమే ఎప్పుడో అప్పుడు వాడతాం కాబట్టి, అన్నిటి ప్రభావం మనపైన ఉంటుంది. భౌతికంగా ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి, మీరు ఉండే ఇంటిని శాస్త్రబద్ధంగా సరిచేసుకోవాలి. అది ప్రత్యక్ష ఫలితాన్ని ఇస్తుంది.
శుభవాస్తు
మాకు మూడు ఇండ్లు ఉన్నాయి. ఏ ఇంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అన్ని ఇండ్లూ వాస్తుకు బాగుండాలా?: సీహెచ్. లక్ష్మి, వరంగల్
ఇండ్లు ఎన్ని ఉన్నా.. మీరు ఉండేది ఏదో ఒక ఇంట్లోనే కదా! అది తప్పకుండా బాగుండాలి. శాస్త్రం అన్ని ఇండ్లు బాగుండాలనే చెబుతుంది. నడిచే కారులోనే ఎవరైనా ప్రయాణం చేస్తారు. నడవని కారు తనదే అయినా.. దానికి ఎవరైనా వాడినప్పుడు అది కూడా బాగుండాలి కదా! అలా ఇండ్లు అంటేనే ఎప్పుడో అప్పుడు తప్పకుండా వాడుతారు. అలా అన్నీ బాగుండాలి. వాస్తుకు ఉంటేనే దానిని గృహం అంటారు. గృహాలు అన్నీ మనవే కాబట్టి, మనమే ఎప్పుడో అప్పుడు వాడతాం కాబట్టి, అన్నిటి ప్రభావం మనపైన ఉంటుంది. భౌతికంగా ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి, మీరు ఉండే ఇంటిని శాస్త్రబద్ధంగా సరిచేసుకోవాలి. అది ప్రత్యక్ష ఫలితాన్ని ఇస్తుంది. గృహాలు-శరీరాలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే, అన్ని కార్యాలకూ అదేకదా ప్రధానం. ఇల్లును బట్టి జీవితం, గృహిణిని బట్టి గృహం అంటారు కదా!

Gazibo
స్లాబు మీద ‘గజీబో’ వేయాలి. ఎక్కడైతే బాగుంటుంది?: డి. లలిత, వంటిమామిడి
మొత్తం స్లాబుపైన నైరుతిలో గది కట్టకుండా ఉంటే.. అక్కడ వేసుకోవడం శ్రేష్టం. ఆ చోట ఒకగది ఉన్నట్లయితే.. మిగతా స్థలంలో ఆగ్నేయంలో కానీ, వాయవ్యంలో కానీ.. దేనినీ తాకకుండా, అక్కడ ఉన్న చోటును బట్టి పిరమిడ్ ఆకారంలో ‘గజీబో’ వేయండి. దాని ఎత్తు నైరుతి గదికన్నా తక్కువగా ఉండేలా చూడండి. గజీబోలో ‘ఫ్లోరింగ్’ అనేది తప్పకుండా నాలుగు అంగుళాలైనా ఎత్తు ఉండాలి. అలాగే నైరుతి గది ఫ్లోరింగ్ కన్నా రెండుమూడు అంగుళాలు కిందికి ఉండాలి. కాదు.. ఎత్తు కావాలి అంటే, గది ఎత్తుకన్నా ఎక్కువ కాకుండా ఫ్లోరింగ్ చేసుకోండి. గజీబో ఎత్తు చివరలో తొమ్మిది అడుగులు మించకుండా ఉండాలి. అన్ని రకాల కొలతలు సరిచూసుకొని వేసుకోండి. ప్లేన్ స్లాబ్ ఉంటే.. ఎత్తు-వెడల్పును మీ ఇష్టానుసారం చేసుకోండి. నీళ్ల ట్యాంకు, దక్షిణ-పశ్చిమంలో కూడా ఉండొచ్చు.

Bakcony
మా ఫ్లాట్‌కి ఈశాన్యం బాల్కనీ ఉంది. దానిలో ఆగ్నేయం టాయిలెట్ ఇచ్చాడు. అలా ఉండొచ్చా?: ఎస్. ధని, కొండాపూర్
అంటే, ఈశాన్యంలో మీకు పడకగది ఉంది. దానికి టాయిలెట్ ఇచ్చారు. ఇంటిలో ఈశాన్యానికి బాల్కనీ ఇచ్చినా.. ఆ చోట, అంటే ఇంటి మొత్తానికి ఈశాన్యం వైపు టాయిలెట్ ఉండకూడదు. ముందు ఆ టాయిలెట్ తొలగించి, దానిని పూర్తిగా ఆ బాల్కనీలో కలపండి. అప్పుడు అది ఈశాన్యం బాల్కనీ అవుతుంది. అంతేకాదు. ఆ బాల్కనీ కూడా ఇంటిని త్రెంపు చేసి ఇస్తారు కాబట్టి, దానికి గ్రిల్ వేసుకోండి. ఫ్లాట్‌లో ఈశాన్యం బెడ్రూమ్ ఇచ్చినప్పుడు దానికి టాయిలెట్ పెట్టకూడదు. కనీసం అందులో ఉన్నవాళ్లకు ఆరోగ్యాలైనా బాగుండాలి కదా! మనిషి అవసరాలు ముఖ్యమే! తొందరగా వెళ్లాలని రాంగ్రూట్లో వెళ్తే.. ఇంకా ప్రమాదం ఎక్కువ కదా! శాస్త్రం అవసరాలు తీర్చుతుంది. కానీ, ఒక పద్ధతిలో ఉండమని చెబుతుంది.

Houaw Railwayline
రైల్వే లైను పక్కన గృహాలు కట్టారు. వాటిని కొనొచ్చా?: ఎ. శ్రీకాంత్, మణికొండ
ఇండ్లు ఎక్కడైనా కట్టడం మనం చూస్తూనే ఉన్నాం. స్థలం ఉండాలి అంతే! హెచ్-టీ లైన్ల కింద కూడా ఇండ్లు కడుతున్నారు కదా! వాయు-శబ్ద-నీటి.. మొదలైన కాలుష్యాలకు దూరంగా ఇల్లు ఉండాలి. ఇల్లు ఉంటే చాలు.. అనుకుంటే కాదు. అది శాస్త్రబద్ధమై ఉండాలి. దాని పరిసరాలు కూడా బాగుండాలి. ఒక వ్యక్తి జీవితం.. ఆ ప్రాంతం, ఆయా వీధులు, ఆ కాలనీ, దాని భౌతిక స్థితిగతులు తదితర అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ‘మనసు’ అనేది ఒకటి ఉంది కదా! దాన్ని బట్టే కదా మనిషి బతుకంతా ఆధారపడి ఉంటుంది. మనసు సూక్ష్మ శరీరమై, అంతఃకరణమై మన నిత్య జీవితాన్ని నడుపుతుంది. దానిని పరిసరాలు తప్పకుండా ‘డామినేట్’ చేస్తాయి. కాబట్టి, రైల్వే కూతల మధ్య, బస్టాండ్ పరిసరాల్లో, ఎయిర్ పోర్ట్ దగ్గర, మురుగు కాలువల పక్కన జీవనం అంత గొప్పగా ఎందుకు ఉంటుంది? మనం రాజీపడ్డా కూడా.. ఆరోగ్యం బాగుండదు. మీరు చూసి నిర్ణయం తీసుకోండి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
98492 78143
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవిష్యత్ బీఆర్ఎస్దే
క్యాన్సర్ జయించిన చిన్నారులతో వేడుకలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

