పెరిగిన తలసిరి
33 జిల్లాల తెలంగాణ ఆవిర్భావం రాష్ట్ర తలసిరినే మార్చివేసింది. పరిపాలన వికేంద్రీకరణకు తోడైన సాగునీటి విస్తరణ... ఇంటింటికీ చేరిన తాగునీరు... పెరిగిన ఉపాధి అవకాశాలు... విస్తరించిన వ్యాపార కార్యకలాపాలు... వేగం పుంజుకున్న రియల్ ఎస్టేట్ రంగం... వెరసి తెలంగాణ ఆర్థిక ప్రగతి కొత్త మలుపు తిరిగింది.
33 జిల్లాల తెలంగాణ ఆవిర్భావం రాష్ట్ర తలసిరినే మార్చివేసింది. పరిపాలన వికేంద్రీకరణకు తోడైన సాగునీటి విస్తరణ… ఇంటింటికీ చేరిన తాగునీరు… పెరిగిన ఉపాధి అవకాశాలు… విస్తరించిన వ్యాపార కార్యకలాపాలు… వేగం పుంజుకున్న రియల్ ఎస్టేట్ రంగం… వెరసి తెలంగాణ ఆర్థిక ప్రగతి కొత్త మలుపు తిరిగింది. దాని ప్రతిబింబమే తలసరి ఆదాయం పెరుగుదల. 2014-15తో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం రెండుమూడు రెట్ల మేర పెరగడం రాష్ట్ర ఆర్థిక ప్రస్థానంలో గమనించదగ్గ పరిణామం. 2016 ఆర్థిక గణాంకాల ప్రకారం పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ రూ.5,83,117 కోట్లు ఉండగా, రాష్ట్ర సగటు తలసరి ఆదాయం రూ.1,43,023గా నమోదైంది.
జిల్లాల పునర్విభజన తర్వాత తెలంగాణ ఆర్థిక ప్రస్థానం వేగం అందుకుంది. పరిపాలన ప్రజల చేరువ కావడం, స్థానికంగా మౌలిక వసతుల విస్తరణ, వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, వ్యాపారం, నిర్మాణ రంగాల్లో పెరిగిన కార్యకలాపాలు… ఇవన్నీ కలిసి జిల్లాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడం ప్రారంభించాయి. 2024 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.15,01,981 కోట్లకు చేరగా, రాష్ట్ర సగటు తలసరి ఆదాయం రూ.3,56,564కు పెరిగింది. అంటే ఒకప్పుడు రూ.70-80 వేల పరిధిలో ఉన్న అనేక జిల్లాల తలసరి ఆదాయం కూడా లక్షల రూపాయల మైలురాళ్లను దాటింది.

Agri
2024 ఆర్థిక గణాంకాల ప్రకారం వికారాబాద్ జిల్లాలో రూ.1,83,826తో తలసరి ఆదాయం అత్యల్పంగా నమోదైంది. నారాయణపేట, జగిత్యాల, కామారెడ్డి, వరంగల్ అర్బన్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన జిల్లాలన్నిటిలో తలసరి ఆదాయం రూ.2 లక్షలకుపైగా నమోదైంది. ఈ జిల్లాలు సైతం ఆ మైలురాయికి చేరువలో నిలిచాయి. ఒకప్పుడు ఆర్థిక కార్యకలాపాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన దృశ్యం నుంచి. జిల్లాలన్నిటా అవకాశాలు విస్తరించే దిశగా తెలంగాణ అడుగులు వేసింది. ఫలితం తెలంగాణలో సిరి నాట్యమాడింది.
2016లో జిల్లాల వారీగా జీఎస్డీపీ, తలసరి ఆదాయం
జిల్లా జీఎస్డీపీ (రూ.కోట్లలో) తలసరి ఆదాయం
హైదరాబాద్ 1,25,882 రూ.2,94,120
రంగారెడ్డి 1,20,817 రూ.1,80,039
నల్లగొండ 45,072 రూ.1,14,353
మెదక్ 43,528 రూ.1,21,639
కరీంనగర్ 38,581 రూ.90,184
ఖమ్మం 37,421 రూ.1,02,919
మహబూబ్‌నగర్ 37,203 రూ.80,121
వరంగల్ 32,033 రూ.79,753
ఆదిలాబాద్ 23,878 రూ.76,921
నిజామాబాద్ 22,585 రూ.78,828
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

