టాలీవుడ్‌కు రుణపడి ఉంటా.. ఐరన్ లెగ్ ముద్రను చెరిపేసిన గబ్బర్‌సింగ్
వర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి శృతి హాసన్. సొంత టాలెంట్, గ్లామర్‌తో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్నది. నటిగా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా గుర్తింపు పొందిన ఈ భామ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, సాత్విక జంటగా నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’లో అతిథి పాత్రలో అలరించనున్నది. ఈ సందర్భంగా శృతి పంచుకున్న కార్వాన్ కబుర్లివి..
నా మొదటి సినిమాకు మా నాన్నే డైరెక్టర్. 2000లో ‘హే రాం’ సినిమాలో బాలనటిగా పరిచయమయ్యాను. ఆ తర్వాత సంగీతంపై దృష్టిపెట్టినా నాలోని నటిని మాత్రం చంపుకోలేదు.
‘కూలీ’ సినిమాలో రజినీ సర్‌తో కలిసి పనిచేసిన తర్వాత ఆయనకు ఫ్యాన్ అయిపోయాను. ఆయన సింప్లిసిటీ, సెట్లో అందరినీ గౌరవించే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేను కూడా ఒక సాధారణ అభిమానిలాగే కమల్ సార్, రజినీ సార్లను ఒకే స్క్రీన్‌పై చూడటానికి ఎదురుచూస్తున్నాను.
అందరూ ఐరన్ లెగ్ అని అనుకుంటున్న సమయంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా నా లైఫ్‌ను టర్న్ చేసింది. ఆ సినిమా హిట్ కొట్టడంతో టాలీవుడ్లో పెద్ద ప్రాజెక్ట్‌లకు ఒకే చేశాను. నాకంటూ ఓ గుర్తింపునిచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను.
నా జుట్టు సంరక్షణ కోసం సెలూన్‌కు అరుదుగా వెలుతుంటాను. ఐదేండ్లుగా సెలూన్ మెట్లెక్కలేదు. 2017లో రంగు వేసుకున్నాను అంతే. ఇప్పటికీ నా జుట్టు నేనే కత్తిరించుకుంటాను. నేనే ట్రీట్మెంట్ చేసుకుంటా.

Srutihasan
పెండ్లంటే కేవలం కాగితంపై సంతకం చేయడం కాదు. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ప్రేమగా ఎంచుకోవడం. అప్పుడే బంధం నిత్యనూతనమవుతుంది. పెండ్లి పేరుతో ఆడంబరాలకు పోవడం నాకు ఇష్టం లేదు. ఆ డబ్బుతో అవసరం ఉన్నవారికి సహాయం చేస్తే మానసిక సంతృప్తి దక్కుతుందని భావిస్తాను. కానీ, డబ్బున్న వాళ్లంతా ఇలా ఆలోచించలేకపోతున్నారని బాధపడుతుంటా.
పెద్ద కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవాలనే ఆలోచనతో సాగే సినిమానే ‘ఆకాశంలో ఒక తార’. దుల్కర్ సల్మాన్, నేను బాల్యంలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం. అప్పట్లో నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి సోంబి పాటను పాడాను. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ నన్ను సోంబి అని పిలవడం మొదలు పెట్టాడు. మంచి యాక్టర్ కూడా. ఇక సాత్వికకు ఇది మొదటి సినిమానే అయినా భయపడకుండా చేసింది. నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. థియేటర్లలో చూస్తారు కదా.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

