సంతోషాన్ని పంచుకుంటా.. బాధను దాచుకుంటా: నజ్రియా నజీమ్
‘అంటే సుందరానికి’ అంటూ, తెలుగువారి ఫెవరెట్ హీరోయిన్ అయింది నజ్రియా నజీమ్. తెలుగులో ఒక్క సినిమానే చేసినా.. తమిళ, మలయాళీ పరిశ్రమల్లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. తాజాగా, సూర్యతో కలిసి ‘సీన్'లో మెరిసింది. ఈ సందర్భంగా నజ్రియా పంచుకున్న కార్వాన్ కబుర్లివి..
మాది కేరళం. చదువుకుంటూనే 2005లో టీవీ వ్యాఖ్యాతగా కెరీర్‌ను ప్రారంభించాను. ఆ తర్వాత బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. మలయాళీ చిత్రం ‘మాడ్ డాడ్’ సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమయ్యాను. నాకు నటించడంతోపాటు సంగీతమన్నా ఇష్టమే. ఒకటి రెండు సినిమాల్లో పాటలు కూడా పాడాను.
నటిగా నాకంటూ ఓ గుర్తింపునిచ్చిన చిత్రం ‘రాజా రాణి’. ఇందులో నా పాత్రకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ పాత్ర చనిపోయే సన్నివేశంలో చాలామంది కంటతడి పెట్టారు. ఆ సినిమా తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి.
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రేమ పెండ్లి చేసుకున్నాను. అప్పుడు నా వయసు 19 ఏండ్లు. ‘బెంగళూర్ డేస్’ సినిమా చేస్తున్న సమయంలోనే ఫహద్ ఫాసిల్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెండ్లికి దారి తీసింది. నా సంతోషాన్ని ఇష్టపడే వ్యక్తుల్లో ఆయన ఎప్పుడూ మొదటివారే.
తిరుమణం ఎనుమ్ నిక్కా’ సినిమా తరువాత తమిళ సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చింది. 12 ఏండ్ల తర్వాత మళ్లీ ‘సీన్’తో కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చాను. స్టార్ హీరో సూర్య సార్‌తో కలిసి నటించడం ఎంతో అనుభూతినిచ్చింది. ఆయన షూటింగ్లో హడావిడి
చేయకుండా కూల్‌గా ఉండే మనిషి.
సంతోషకరమైన విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటాను. బాధ మాత్రం నాలోనే దాచుకుంటాను. అభిమానులు మనల్ని చూసి స్పూర్తి పొందాలంటే ఆ మాత్రం సీక్రెట్స్ మెయింటెన్ చేయడంలో తప్పు లేదు కదా. అయినా ఇప్పటివరకు అలా బాధపడే రోజు రాలేదనుకోండి.
తెలుగులో నానీతో చేసిన సినిమాకు మంచి ఆదరణ దక్కింది. కానీ, ఆ తర్వాత అవకాశాలు రాలేదు. మహేశ్‌బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేయాలని ఉంది. అలాంటి ఆఫర్లు వస్తే ఏమీ ఆలోచించకుండా ఓకే చెప్పేస్తా. చాలామంది పెండ్లి తర్వాత సినిమాలు తగ్గిస్తారు. నేను మాత్రం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాను.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
క్యాన్సర్ జయించిన చిన్నారులతో వేడుకలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
Bodies of SPOs | దారుణం.. శవపేటికలు లేకుండా డంపర్‌లో పోలీసుల మృతదేహాలు తరలింపు..!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

