పాడు మొఖం
ఇది గూడ గోపాల్ ఖంద్ కతనేనుల్లా! ఒక యాడాది కృష్ణచంద్ర పుట్టిన్రోజు దూందాంగ జేశిండ్లు. గానా బజానాలన్నీ అయిపోయెటాళ్లకు మాలెస్క పొద్దుగూకింది. దాంతోని అచ్చినోళ్లందరూ దర్బార్లనే నపరోతాన పండుకున్నరు.
ఇది గూడ గోపాల్ ఖంద్ కతనేనుల్లా! ఒక యాడాది కృష్ణచంద్ర పుట్టిన్రోజు దూందాంగ జేశిండ్లు. గానా బజానాలన్నీ అయిపోయెటాళ్లకు మాలెస్క పొద్దుగూకింది. దాంతోని అచ్చినోళ్లందరూ దర్బార్లనే నపరోతాన పండుకున్నరు. గోపాల్ ఖంద్.. రాజు పక్క అర్రల పన్నడు. పొద్దుగాల లేసుడుతోనే.. అవుతలికి అచ్చిండు గోపాల్. అంతట్లకే రాజు సుత నిద్రలేశి అచ్చిండు. ఇద్దరు నడుసుకుంట తోటలకు వోయచ్చిండ్లు. అంతట్లకే.. రాజుకు గడ్డం జేసే సేవకుడు అచ్చి.. రాజుకు గడ్డం జేయవట్టిండు.
ఆడుగూడ రాత్రంత నిద్రవోకుంట ఉన్నడు గదా? నిద్రమత్తులుండి.. రాజుకు కత్తి గోసుకపోయి శెంపల మీద నెత్తరు గారవట్టింది. గది జూశిన సేవకుని పాణాలు పోయినంత పనైంది. తప్పిచ్చుకోనీకి.. “అయ్యా! మీరు పొద్దుగాల లేవంగనే ఏ దరిద్రపు మొకం జూశిండ్లో! ఎన్నడు గాంది గియ్యాల గిట్లయ్యింది.. నా తప్పేంలేదు బాంచెన్!” అంట అన్నడు.
రాజు సుత నువ్వద్దనే అనుకొని.. “పొద్దుపొద్దుగాల గోపాల్ ఖంద్ మొకం జూశిన. గందుకే గిట్లయ్యింది!” అంట కోపంతోని.. గోపాల్ కండ్లు పీకెయ్యమంట హుకుమిచ్చిండు. గీ ముచ్చట దెల్శిన గోపాల్.. “అయ్యా! నా మొకం జూశినందుకే మీకు శెంపమీద గాటువడ్డది. నేను ఏ పాడు మొకం జూశిన్నో.. నా కండ్లే వోతున్నయి!” అంట మొత్తుకున్నడు. ఎంటనే రాజుకు ముచ్చట సమజైంది. గోపాల్ పొద్దుగాల జూశింది తన మొకమేనాయె. ‘అయ్యో!’ అనుకుంట హుకుం వాపస్ దీసుకున్నడు.
ఆకాశంలో చెట్టు.. చెట్టు నిండా పూలు.. ఎంత కొట్టినా రాలవు?
– నక్షత్రాలు
చూస్తే సురాలోకం.. పడితే నీటికుండ.. పగిలితే పచ్చ బంగారం?
– తాటిపండు
పెద్దల మాట
అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది. సృజనాత్మకత ఆలోచనకు దారితీస్తుంది. ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది. జ్ఞానం.. మిమ్మల్ని గొప్పగా చేస్తుంది.
టంగ్ ట్విస్టర్స్ మీకు తెలుసా?
మగవాళ్లు మీసాలు పెంచడం ఒక ఫ్యాషన్. కొందరు గౌరవం కోసం, నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడం కోసం మీసాలు పెంచితే.. మరికొందరు వాటిని మెలితిప్పుతూ వీరత్వానికి సూచనగా భావిస్తారు. అయితే, ఇలా మెలితిప్పిన మీసాలు మనుషుల్లోనే కాదు.. ఇంకాటెర్న్ అనే పక్షికీ ఉంటాయి. ఇవి దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి.
పద్యం – భావం
రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ గోపించురాజు గొల్వకు పాపపు దేశంబు సొరకు, పదిలము సుమతీ!
తాత్పర్యం : రూఢి చేసి మాట్లాడిన తరువాత.. అబద్ధాలు చెప్పకూడదు. సహాయంగా ఉండే బంధువులను నిందించవద్దు. కోప స్వభావం కలిగిన రాజును సేవించరాదు. పాపాత్ములుండే దేశంలో నివసించవద్దు. ఇవి తగని పనులు కాబట్టి.. ఈ విషయాలల్లో జాగ్రత్త అవసరం.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

