బెంగాలీ కథ
ఇగో! మన తెలుగోళ్లకు చెన్నాల్రామలింగం ఎట్లనో.. బెంగాలోళ్లకు గీ గోపాల్ బార్ (గోపాల్ ఖంద్) గట్లనుల్ల. బెంగాల్ రాజు కృష్ణచంద్ర తాన ఉంటుండే.. గీ గోపాల్ ఖంద్. ఈయినె కతలు గూడ.. మస్తుగ నవ్విస్తయి. కృష్ణచంద్ర రాజు వాళ్ల నాయిన సచ్చిపోయి.
ఇగో! మన తెలుగోళ్లకు చెన్నాల్రామలింగం ఎట్లనో.. బెంగాలోళ్లకు గీ గోపాల్ బార్ (గోపాల్ ఖంద్) గట్లనుల్ల. బెంగాల్ రాజు కృష్ణచంద్ర తాన ఉంటుండే.. గీ గోపాల్ ఖంద్. ఈయినె కతలు గూడ.. మస్తుగ నవ్విస్తయి.
కృష్ణచంద్ర రాజు వాళ్ల నాయిన సచ్చిపోయి.. యాడాదైంది. యాడాది మాశికం జేసేటప్పుడు.. “రాజా! పెద్దరాజుకు బర్లు, గొర్లు అంటే మస్తు పాయిరం గదా! ఇయ్యాళ్ల ఆయినె పేరుమీద ఒక మంచి ఎద్దును దేవునికి ఇడిశి పెట్టుండ్లి!” అంట జెప్పిండు అయ్యగారు. ‘అట్నె!’ అని ఓ మాంచి ఎద్దును జన్నెకిడిశిండ్లు. అది తిరుక్కుంట తిరుక్కుంట మీర్జాఫర్ నవాబు డేరా తానికి వోయింది.
దాన్ని సూడంగనే.. ఆయినెకు నోరూరింది. దొర్కవట్టుమని బటులకు జెప్పిండు. అచ్చే జుమ్మకు అలాల్ జెయ్యిమంట హుకుం జేశిండు. గీ ముచ్చట ఆ నోటెంట ఈనోటెంట కృష్ణచంద్ర రాజుకు ఎర్కయి.. మస్తు నారాజైండు. పొయ్యిపొయ్యి మీర్ జాఫర్ నవాబాయె! ‘గా ఎద్దు మా నాయిన పేరుమీద్ది!’ అంట ఎట్ల జెప్పుతడు. అంతట్లకే గోపాల్ ఖంద్కు పనివడి రాజుతానకు అచ్చిండు. నారాజ్గున్న రాజును జూశి.. అసలు ముచ్చట అర్సుకున్నడు. తెల్లారంగనే మీర్ జాఫర్ డేరా దగ్గరికి వోయి సలాం జేసి గూసున్నడు. ఎక్కడెక్కడి కతలో శెప్పుకొంట.. అక్కడున్న అందర్నీ మాలెస్క సేపు నవ్విచ్చిండు.
బువ్వటాళ్ల అయ్యేటాలకు.. “ఇగ వోత హుజూర్!” అంట లేశి, సలాం జేసిండు. గప్పుడే జూశినట్టు.. “అగో! గీ ఎద్దును గీడెందుకు గట్టేశిండ్లు? ఛీఛీ!” అంట అన్నడు. “గిది నీకు ఎర్కేనా!” అంట అడిగిండు మీర్ జాఫర్. “అయ్యో! గిది గలీజుది. పెంటపొంట ఏదివడితె అది మేత్తది. గందుకే.. రాజు దీన్ని జన్నెకిడిశిండు. థూథూ!” అంట ఇకారంగ మొకం బెట్టిండు. గా మాటలిన్న మీర్ జాఫర్.. “థూ! గీ గలీజ్ ఎద్దు మాకెందుకు?” అంట.. దాన్ని ఇడిశివెట్టుమని జెప్పి, గోపాల్‌కు నజ్రానా ఇచ్చి పంపిండు. నాయినకు ఇడిశిన ఎద్దును తెలివితోని కాపాడినందుకు.. రాజుసుత గోపాల్‌కు మంచి ఎద్దును ఇనాం ఇచ్చిండు.
చెప్పుకోండి
- ఈయనొస్తే..ఎవరైనా నోరు తెరవాల్సిందే?
– ఆవలింత
- పసిడిపెట్టెలో ముత్యపు గింజ?
– వడ్లగింజ
- అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట. తోకతో నీళ్లు తాగుతుంది?
– దీపం వత్తి
పెద్దల మాట
- ఎదుటి మనిషిని అర్థంచేసుకోవాలంటే.. నీకు క్షమించే గుణం ఉండాలి!
– గౌతమ బుద్ధుడు
మీకు తెలుసా?
ఎంతో శ్రమించి.. మనకోసం మధుర పదార్థాన్ని అందించే తేనెటీగలకు కోపం కాస్త ఎక్కువే. అందులోనూ ఆఫ్రికా తేనెటీగలైతే.. మహా కోపిష్టివట. తేనెతుట్టెలను ఏమాత్రం కదిలించినా.. వెంటపడి మరీ కుట్టేస్తాయి. అర కిలోమీటరు దాకా తరిమితరిమి కొడతాయి. మనుషుల్నే కాదు.. ఆఫ్రికా అడవులకు రాజులైన సింహాలు, ఏనుగులు కూడా ఇవంటే హడల్!
పద్యం – భావం
లోభమోహములను ప్రాభవములు తప్పు తలచిన పనులెల్ల తప్పి చనును తానొకటి దలచిన దైవమొండగుచుండు విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం : లోభం, మోహం ఉండేవారికి గొప్పతనం ఉండదు. అలాంటివారు చేయాలనుకున్న ఎలాంటి పనులూ ముందుకు సాగవు. ఇలాంటి వారి విషయాల్లో.. తానొకటి తలిస్తే, దైవమొకటి తలుస్తుంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

