అదృష్టం కూడా ఉండాలి!
వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడంలో తనకు తానే సాటి. ఎంచుకున్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోవటంలో తనే మేటి. అయినా తానెవరికీ పోటీ కాదని, తనకెవరూ పోటీ లేరని చెబుతూనే హీరోలకు పోటీగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నదీ బ్యూటీ.
వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడంలో తనకు తానే సాటి. ఎంచుకున్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోవటంలో తనే మేటి. అయినా తానెవరికీ పోటీ కాదని, తనకెవరూ పోటీ లేరని చెబుతూనే హీరోలకు పోటీగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నదీ బ్యూటీ. చిరునవ్వే ఆభరణంగా.. అందం, అభినయం, ఆహార్యాలే అదనపు అర్హతలుగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు అభిమాన హీరోయిన్గా మారిపోయింది. తన కెరీర్లో 50వ సినిమాగా రూపొందిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చిన సందర్భంగా అంజలి
చెప్పిన ముచ్చట్లు…
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా నా కెరీర్లో 50వ చిత్రం కావడం సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలో ఇలాంటి సుదీర్ఘమైన కెరీర్ ఉండటం గర్వంగా ఉంది. నేను నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి ‘గేమ్ ఛేంజర్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాల్లో నా పాత్రలు వేటికి అవే భిన్నంగా ఉంటాయి.
నేను సినిమాల్లో ఇంతకుముందు చేయని, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నాను. ‘గీతాంజలి
మళ్లీ వచ్చింది’ సినిమా ైక్లెమాక్స్‌లో యాక్షన్ కూడా చేశాను. నటన రొటీన్‌గా మారితే ఆసక్తి తగ్గుతుంది. అందుకే నా పాత్రల్లో తాజాదనం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. నేను చాలా ఓపెన్‌గా ఉంటా. అందరితోనూ త్వరగా కలిసిపోయే మనస్తత్వం నాది.
చాలా మంది అంటుంటారు కానీ, నిజానికి సినీ పరిశ్రమలో పోటీ లేదు. అవన్నీ కావాలని సృష్టించిన ఉత్తుత్తి ముచ్చట్లే. ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ టాలెంట్‌ను బట్టి ఆఫర్లు పొందుతున్నారు. వీళ్లే కరెక్ట్ అని నమ్మినప్పుడే మేకర్స్ అవకాశాలు ఇస్తారు. ఇతరులు చేయలేని పాత్రలు నాకు వస్తున్నట్టే మిగతా నటీనటులకు కూడా వాళ్లకు తగ్గ పాత్రలు తప్పకుండా దక్కుతాయి.
నేను చాలా సున్నిత మనస్కురాలిని. నా కెరీర్లో చాలా పుకార్లను విన్నాను. కొన్ని నన్ను బాధించాయి కూడా. కొందరు నా వ్యక్తిగత విషయాల గురించి ఇష్టానుసారంగా ఊహాగానాలు చేస్తారు. ఉద్దేశపూర్వకంగానే నన్ను పుకార్లలోకి లాగుతున్నారు అని అర్థమైన తర్వాత వాటిని పూర్తిగా పట్టించుకోవడమే మానేశాను.
కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు సహనటుడు నా గురించి ఏమనుకుంటాడోనని ఆందోళన కలుగుతుంటుంది. ఇంటిమేట్ సన్నివేశాలు సినిమాకు అవసరం కాబట్టి అసౌకర్యంగానే వాటిలో నటిస్తున్నా. నిజజీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే సాన్నిహిత్యానికి.. సినిమాలో ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది.
నాకు ఇష్టమైన దర్శకుడు మణిరత్నం. ఆయన చిత్రీకరణ శైలి భిన్నంగా ఉంటుంది. ఎప్పటికైనా ఆయన
డైరెక్షన్లో నటించాలనేది నా కోరిక.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

