నలభై రాగానే రాజకీయాల్లోకి..
‘రాజమండ్రి రోజ్ మిల్క్' సినిమాతో వెండితెరకు పరిచయమైన మలయాళీ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్. ఆ సినిమా నిరాశపరిచినా నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్నది. మ్యాడ్ మూవీతో మరో అడుగు ముందుకేసిన ఈ ముద్దుగుమ్మ ‘8 వసంతాలు’ సినిమాలో నటన, అందంతో యూత్‌ను కట్టిపడేసింది. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. ప్రస్తుతం సుమంత్ ప్రభాస్‌తో ‘రోమాంచకం’లో జోడి కట్టిన ఈ కేరళం కుట్టి పంచుకున్న కార్వాన్ కబుర్లు ఇవి..
‘రాజమండ్రి రోజ్ మిల్క్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన మలయాళీ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్. ఆ సినిమా నిరాశపరిచినా నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్నది. మ్యాడ్ మూవీతో మరో అడుగు
ముందుకేసిన ఈ ముద్దుగుమ్మ ‘8 వసంతాలు’ సినిమాలో నటన, అందంతో యూత్‌ను కట్టిపడేసింది. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. ప్రస్తుతం సుమంత్
ప్రభాస్‌తో ‘రోమాంచకం’లో జోడి కట్టిన ఈ కేరళం కుట్టి పంచుకున్న కార్వాన్ కబుర్లు ఇవి..
నాకు రాజకీయాలంటే ఆసక్తి. అందులో భాగంగానే మన చట్టాల గురించి పూర్తి అవగాహన ఉండాలన్న ఆలోచనతో లా చదువుతున్నాను. ఇప్పటికైతే సినిమాలు నా చదువుకు ఎప్పుడూ ఆటకంగా నిలవలేదు. నాకు 40 ఏండ్లు వచ్చాక కచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్తా.
మాది కేరళం. చిన్నప్పటినుంచి క్లాసికల్ డ్యాన్స్, కరాటే, కళరియపట్టు, కత్తిసాము లాంటి విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాను. కేరళం సంప్రదాయ వాద్యమైన చెండా వాయించడంలోనూ పట్టుంది. నా ఎదుగుదలకు ఉపయోగపడే వాటితోపాటు ఆత్మరక్షణ విద్యలూ నేర్చుకున్నాను. ‘8 వసంతాలు’లో ఈ కళలు నాకు చాలా ఉపయోగ పడ్డాయి.
నాకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి లేదు. అనుకోకుండా వచ్చాను. కరోనా సమయంలో ఖాళీగా ఉండటంతో ఓ మలయాళి సినిమాలోకి డ్యాన్సర్‌గా వెళ్లాను. ఆ సినిమా డీఓపీ నన్ను చూసి హిరోయిన్‌గా ట్రై చేయమని సలహా ఇచ్చాడు. ఇంట్లోవాళ్లకు ఇష్టంలేకున్నా నన్ను నేను నిరూపించుకునేందుకు మాత్రమే సినిమాలకు ఆడిషన్లు ఇవ్వడం మొదలు పెట్టాను.
ఇప్పటివరకు ఇంటిమేట్ సీన్స్ చేయలేదు. అలాంటి సన్నివేశాల్లో నటించాలంటే మనసుకు కష్టంగా అనిపిస్తుంది. నిజంగా కథ డిమాండ్ చేస్తే మాత్రం కొంత లిమిటేషన్‌తో ఈ సీన్లను చేయడానికి సిద్ధంగా ఉంటాను. రోమాంచకం సినిమాను ఈ జనరేషన్ తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. సుమంత్ మంచి నటుడు. నాలాగే సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతుంటాడు.
ప్లస్ 2 చదువుతూనే ఇంటికీ, షూటింగ్ లొకేషన్లకు చక్కర్లు కొట్టేదాన్ని. మొదట్లో చేసిన సినిమాలు విడుదల కాకపోవడం, ఆ తర్వాత చేసినవి అంతగా గుర్తింపు ఇవ్వకపోవడంతో నిరాశపడ్డాను. ఇక సినిమాలు చేయకూడదనుకున్నా. కానీ ‘8 వసంతాలు’ కథ విని ఒకే చెప్పాను.
సినిమాల్లో హిట్, ఫ్లాప్ రెండింటినీ ఒకే విధంగా పరిగణిస్తాను. 2023లో కోలీవుడ్‌లో విక్రమ్ ప్రభుతో రైడ్, రజనీకాంత్ లాల్‌సలామ్‌లో నటించాను. అవి ఆశించిన విజయాన్ని అందుకోలేక పోవడంతో కాస్త నిరాశకు గురయ్యాను.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

