ఫ్లూ అంటే జలుబు, జ్వరమే అని లైట్ తీసుకోకండి.. దీంతో ఆ సమస్య కూడా వస్తుందంట!!
Flu Virus and Heart Diseases| ఫ్లూ మనకు కొత్తేం కాదు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలను కలిగించే ఫ్లూ వ్యాధి ఒక్కోసారి ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీసి, ప్రాణాంతకంగా మారవచ్చు. వెంటనే చికిత్స తీసుకుంటే, ఆ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. కానీ ఈమధ్యకాలంలో గమనించిన విషయం ఏమిటంటే… ఫ్లూ నుంచి బయటపడిన వాళ్లలో కొందరు గుండె సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతున్నదని గతంలో భావించేవారు. కానీ ఓహియో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు.
ఫ్లూ వైరస్ నేరుగా గుండె కణాలను ప్రభావితం చేసే ఆస్కారం ఉన్నదట. దీనివల్ల గుండె పనితీరు దెబ్బతినవచ్చు. ఈ విషయాన్ని నిరూపించేందుకు వాళ్లు ఫ్లూ వైరస్‌ను రెండుగా విడదీశారు. ఒక భాగం ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తే, మరో భాగం గుండె కణాల వరకూ చేరుకుంటుంది. ఈ రెండో భాగమే గుండె పనితీరును దెబ్బతీస్తున్నట్టు గమనించారు. కాబట్టి ఫ్లూ బారినపడిన వారితోపాటు, దానినుంచి కోలుకున్న వారూ జాగ్రత్త!
Read More :
హృద్రోగులకు ఊరటనిచ్చే వార్త.. గుండె కండరాలకు పునరుజ్జీవం”
Drinking Water | నీళ్లు తక్కువగా తాగితే గుండె జబ్బులు వస్తాయా?”
ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకుంటే మీ గుండెకు డేంజర్ బెల్ మోగినట్టే !!”
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Flu
- Flu virus
- heart
- Heart disease
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

