అన్ని శాండ్ ఆర్ట్‌లతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్.. ఎందుకంత స్పెషల్ !!
Moving Sand art | కాలం పరుగుల్ని గాజుసీసాలో ఒడిసిపడితే అది.. అవర్ గ్లాస్. కరిగిపోయే కాలాన్ని అందమైన చిత్రంగా మలిస్తే అది.. మూవింగ్ శాండ్ ఆర్ట్. కాలానికి కళను అద్దితే ఎలా ఉంటుందో ఈ ఇసుక బొమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది. నాజూకుగా జాలువారే ఇసుకతో అందమైన ల్యాండ్ స్కేప్లను ఏర్పరచడమే ఇందులోని ప్రత్యేకత.

కొండలూ లోయల్ని కనువిందుగా చూపించే ల్యాండ్‌స్కేప్ వాల్ ఫ్రేమ్‌లను ఇష్టంగా గోడకు పెట్టుకుంటాం. మోస్తరుగా ఉన్న వాటిని టేబుళ్ల మీదా అలంకరిస్తాం. అయితే, ఇలాంటి ఫ్రేములు ఒకసారి పెట్టామంటే అవి ఉన్నన్నాళ్లూ అదే చిత్రం కనిపిస్తుంది. దాన్ని మారిస్తే తప్ప కొత్త దృశ్యాన్ని మనం చూడలేం. కానీ మూవింగ్ శాండ్ ఆర్ట్ పెయింటింగ్స్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. వీటి పైభాగం నుంచి కిందిభాగానికి నిరంతరం ఇసుక కదులుతూ ఉంటుంది. అలా ఇసుక పడే విధానాన్ని బట్టి కొండలూ లోయలతో కూడిన అందమైన దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. మళ్లీ దీన్ని తలకిందులు చేసిపెడితే ఇసుక కిందికి జాలువారుతూ మరోరకం ల్యాండ్‌స్కేప్‌ను ఏర్పరుస్తుంది. ఇలా ఏర్పడేటప్పుడు ఒకసారి ఏర్పడ్డ చిత్రం మరొకసారి ఏర్పడదు. ప్రతిసారీ దేనికదే ప్రత్యేకం.

ఇక ఇందులో వాడే ఇసుక కూడా ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు… ఇలా రకరకాల రంగుల్లో ఉంటుంది. చూసేందుకు అందంగా కనిపించేలా తళుక్కున మెరిసే గ్లిట్టర్‌ను కూడా ఇందులో కలుపుతున్నారు. వివిధ వర్ణాల ఇసుకలు వేరువేరు బరువుల్లో ఉండటం వల్ల ఒకదానితో ఒకటి కలిసిపోవు. ఉదాహరణకు తెలుపు రంగులో ఉండే ఇసుక కంటే నలుపు రంగులో కనిపించే ఇసుక బరువుగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక రకం ఇసుక ఒకచోటే పడుతుంది. దానివల్ల విభిన్న రంగుల మేళవింపుగా చూడచక్కని బొమ్మ మనకు కనిపిస్తుంది. ఈ శాండ్ ఆర్ట్‌లో రెండు గాజుపొరల మధ్య రకరకాల ఇసుకలు, నీళ్లు, గాలి కలగలిపిన మిశ్రమం ఉంటుంది. ఇందులోని గాలి బుడగల మధ్యలోంచి ఇసుక కిందికి పడుతుంది. ఈ గాలి బుడగలు కదులుతూ ఉంటాయి కనుక ఒక్కోసారి ఒక్కోరకం బొమ్మ ఏర్పడుతుందన్నమాట. ఇలా చిత్రం పూర్తయ్యేందుకు తీసుకున్న ఫ్రేమ్ సైజును బట్టి ఐదు నిమిషాలు మొదలు రెండు మూడు గంటల దాకా సమయం పడుతుంది.

ఇక ఈ రకం మూవింగ్ శాండ్ పెయింటింగ్ ఫ్రేముల్లో గుండ్రటి వాటితోపాటు చతురస్రాకారాల్లో ఉండేవీ, పలకలవీ కూడా ఉంటున్నాయి. రాత్రిపూట మెరిసేలా నైట్ గ్లోయింగ్ ఇసుకతోనూ వీటిని చేస్తున్నారు. లైట్ అమర్చిన ఫ్రేములు కూడా వస్తున్నాయి. డిమ్‌లైట్ లేదా ఎక్కువ కాంతితో వెలిగేలా వీటిని రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. గోడకు పెట్టుకుని గుండ్రంగా తిప్పుకొనే వీలుగానూ రూపొందుతున్నాయి. ఇలా నెమ్మదిగా పడుతూ ఉండే ఇసుకను చూడటం మనసుకు ప్రశాంతతను ఇస్తుందట. ఇంకేం, మాటిమాటికీ బొమ్మలు మారే ఈ ఫ్రేములకు మీరూ ఓటేస్తారుగా మరి!

Read More :
Non Alcoholic Drinks | ఈ బీరు, విస్కీల్లో ఆల్కహాల్ అస్సలు ఉండదట!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

