నాంచారి ఆత్మ పగ సాధించిందా?
నాంచారి ఆత్మ పగ సాధించిందా? పోలీసులను ఆశ్రయించిన ఉనీషాను నాంచారి ఏం చేసింది? రసవత్తరమైన మలుపులతో సాగుతుంది ఆ రాత్రి నవల. ర్యాగింగ్ వల్ల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతాయో చెబుతుందీ నవల. క్రైమ్ థ్రిల్లర్ రచనలు చదివేవారికి ఈ నవల బాగా నచ్చుతుంది.
పుస్తక సమీక్ష
వదలదు ఈ నాంచారి!
ప్రతి క్రైమ్ వెనుక ఓ బాధితుడి మనోగతంఉంటుంది. మన కండ్లముందు జరిగే ప్రతి ఘటనకూ బలమైన కారణాలుంటాయి. అలాంటి సంఘటనను ఆధారం చేసుకుని సాగుతుంది ఈ నవల. డాక్టర్ కావాలనే కోటి ఆశలతో పల్లె విడిచి నగరానికి వస్తుంది నాంచారి. తను చేరిన మెడికల్ కాలేజీలో సీనియర్లు అయిన విశ్వాని, సౌజన్య, ఉనీషాలు నాంచారిని ర్యాగింగ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతారు. ర్యాగింగ్‌లో భాగంగా ఓ రోజు రాత్రి 12 గంటలకు ఒక్కతే పోస్ట్‌మార్టం గదిలోకి వెళ్తుంది నాంచారి. అదే సమయంలో ఈ ముగ్గురు దెయ్యాల వేషం వేసుకొని భయపెట్టడంతో నాంచారి గుండె ఆగి చనిపోతుంది. నాలున్నరేండ్ల తర్వాత.. తనను చంపిన వాళ్లను వెంటాడుతూ వస్తుంది నాంచారి.
ఒక్కొక్కరిని భయానికి గురిచేస్తూ, ముందే ఫోన్లో సందేశాలు పంపించి హెచ్చరిస్తుంటుంది. కానీ, తమకు ప్రాణభయం ఉందనే విషయం పోలీసులకు చెబితే నాంచారి చావు వెనుక ఉన్నదెవరో తెలిసిపోతుందనీ, దొరికిపోతమనే భయంతో మౌనం వహిస్తారు ఆ ముగ్గురు. ఈ క్రమంలో విశ్వాని, సౌజన్యలు అనుమానస్పదంగా చనిపోతారు. తర్వాతి లిస్ట్‌లో ఉనీషా ఉంటుంది. ఒకవైపు ఆ చావులకు సంబంధించి పోలీసులు ఇన్వేష్టిగేషన్ ప్రారంభిస్తారు. ఆ సమయంలోనే ఉనీషా పోలీసులను ఆశ్రయిస్తుంది. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నాంచారి ఆత్మ వీరిపై పగ సాధించిందా? పోలీసులను ఆశ్రయించిన ఉనీషాను నాంచారి ఏం చేసింది? ఇవన్నీ క్లైమాక్స్‌లో రసవత్తరమైన మలుపులతో సాగిపోతాయి. ఈ నవల చదువుతున్నప్పుడు మన కండ్లముందు ఆ సంఘటనలన్నీ కదలాడుతాయి. ర్యాగింగ్ వల్ల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతాయో చెబుతుందీ నవల. క్రైమ్ థ్రిల్లర్ రచనలు చదివేవారికి ఈ నవల బాగా నచ్చుతుంది.
ఆ రాత్రి…(నవల)
రచయిత: సయ్యద్ ఆయేషా సుల్తానా
పేజీలు: 93, ధర: రూ.100
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్
కవిర్విశ్వో మహాతేజ
గుంటూరు శేషేంద్ర శర్మ శత జయంతి ప్రత్యేక సంచిక
పేజీలు: 71
ప్రచురణ: శ్రీ కళాగౌతమి తెలుగు భాషాభివృద్ధి మాసపత్రిక
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆధునిక తెలుగు సాహిత్యంలో వైతాళికుడిగా స్మరించదగిన కవిగా గుర్తింపు పొందారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఆయన శత జయంతి సందర్భంగా, శ్రీ కళాగౌతమి తెలుగు భాషాభివృద్ధి మాసపత్రిక.. ఆయనను స్మరిస్తూ ఈ పత్య్రేక సంచికను తీసుకొచ్చింది.
– రాజు పిల్లనగోయిన
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవిష్యత్ బీఆర్ఎస్దే
క్యాన్సర్ జయించిన చిన్నారులతో వేడుకలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

