మక్కల ఇడ్లీ.. మస్తు ఆరోగ్యమండీ!
మక్కలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. వీటితోటి ఇడ్లీలు చేసుకోవచ్చు. అల్పాహారానికి అల్ఫాహారం, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఇవి చేసే విధానం తెలుసుకుందాం.
కార్న్ ఇడ్లీ
కావలసిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు: ఒక కప్పు
బొంబాయి రవ్వ: ఒక కప్పు
కొత్తిమీర: అరకట్ట
పచ్చిమిరపకాయలు: నాలుగు
పెరుగు: గరిటెడు
ఈనో సాల్ట్: ఒక శాచెట్
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
ముందుగా మొక్కజొన్న గింజలను శుభ్రంగా కడిగి మిక్సీలో కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. ఈ మిశ్రమానికి బొంబాయి రవ్వ జోడించి అందులో పెరుగు కూడా వేసి బాగా కలపాలి. అరకప్పు నీళ్లు పోసి ఇడ్లీ పిండి లాంటి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని అరగంటసేపు వదిలేయాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిరపకాయలను కూడా సన్నటి ముక్కలుగా చేసుకోవాలి . ఈ రెండిటిని మొక్కజొన్న పిండి మిశ్రమంలో కలిపి ఉప్పు కూడా సరిపడా వేయాలి. ఇప్పుడు ఇడ్లీలు ఉడికించేందుకు పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని, అవి మరుగుతుండగా… మొక్కజొన్న పిండి మిశ్రమంలో ముప్పావు ప్యాకెట్ ఈనో సాల్ట్ వేసి కలిపి, ఇడ్లీ లాగా వేసుకోవాలి. ఆవిరి మీద దాదాపు 30 నిమిషాలు ఉడికిస్తే రుచికరమైన ఆరోగ్యకరమైన కార్న్ఇడ్లీ సిద్ధమైపోతుంది.
– ఎం.బాలరాయుడు, పాకశాస్త్ర నిపుణురాలు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

