హెల్త్ బిట్స్
ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నోట్లో వేసుకోకుండా నిర్ణీత కాల పరిమితికి లోబడి తినడాన్ని ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' అంటారు. ఈ విధానాన్ని అనుసరించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులు బరువు తగ్గడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవచ్చని ఒక అధ్యయనంలో తేలింది.
-
ఇంటర్మిటెంట్తో అదుపులో డయాబెటిస్
ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నోట్లో వేసుకోకుండా నిర్ణీత కాల పరిమితికి లోబడి తినడాన్ని ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ అంటారు. ఈ విధానాన్ని అనుసరించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులు బరువు తగ్గడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవచ్చని ఒక అధ్యయనంలో తేలింది. మధ్యాహ్నం తర్వాత రాత్రి 8 వరకు ఎనిమిది గంటల విరామంతో తినే అలవాటు ఉన్నవాళ్లు 6 నెలల్లో.. ఆహారంలో కేవలం క్యాలరీలు పాతికశాతం తగ్గించుకున్న వాళ్లతో పోలిస్తే ఎక్కువ బరువు తగ్గారట. యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ చికాగోకు చెందిన పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం జామా జర్నల్‌లో ప్రచురితమైంది. “సంప్రదాయ డైటింగ్‌తో పోలిస్తే నిర్ణీత కాల పరిమితుల్లో తినడం ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం” అని ఓ పరిశోధకుడు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఆరు నెలల పరిశోధన కాలంలో ఆరోగ్యం విషయంలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కూడా కనిపించలేదట. అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎంచుకునేందుకు ముందు వైద్యుల సలహా తప్పనిసరి అని పరిశోధకులు సూచించారు.
-
గర్భిణుల్లో ఒత్తిడితో పిల్లలకు ముప్పు
గర్భిణిగా ఉన్న సమయంలో తల్లులు ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుకు లోనవుతే అది పుట్టబోయే పిల్లల మీద దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందట. బాల్యంలో, టీనేజీ దశలో వారి మానసిక ఆరోగ్యం, ప్రవర్తనకు సంబంధించి ముప్పుగా పరిణమిస్తుందట. ఇలాంటి పిల్లలు దురుసుగా ప్రవర్తించినట్టు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పేర్కొన్నారని పరిశోధకులు తెలిపారు. కాబట్టి గర్భిణిగా ఉన్న సమయంలో కుటుంబసభ్యులు మహిళల మానసిక ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపాలని పరిశోధకులు సూచించారు. అంతేకాదు ప్రసవించిన తర్వాత కూడా బాలింతకు ఒత్తిడి కలగకుండా చూసుకోవడం ప్రధానమని కూడా వారు గుర్తించారు. గర్భంలో స్ట్రెస్ హార్మోన్లు పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపడమే ఈ పరిస్థితికి కారణమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
-
మొక్కల కార్బొహైడ్రేట్లే మంచివి
బరువు తగ్గడానికి కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటుంటారు. అయితే, ఇందుకు జంతు ఆధారిత కార్బొహైడ్రేట్లు తగ్గించుకోవడం వల్ల అంత ఉపయోగం ఉండదట. మొక్కల ఆధారిత కార్బొహైడ్రేట్లను తగ్గించుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఓ పరిశోధనలో కనుక్కొన్నారు. మొక్కల నుంచి లభించే ప్రొటీన్లు, కొవ్వులకు… ముతక ధాన్యాల నుంచి లభించే ఆరోగ్యకరమైన కార్బొహైడ్రేట్లు తోడవుతే బరువు పెరగడం నిదానిస్తుందట. అదే జంతు ఆధారిత ప్రొటీన్లు, కొవ్వులు కలిగిన కార్బొహైడ్రేట్లు తక్కువున్న ఆహారం, రిఫైన్ చేసిన కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారం తింటే వేగంగా బరువు పెరుగుతారట.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

