ఇక్కడికి వచ్చేదాన్నే కాదు..
తెలుగుతెరపై ఉత్తరాది భామల ఊసే ఎక్కువ! ముంబయి ముద్దుగుమ్మలు, తుళు తళుకులను తట్టుకొని నెగ్గుకురావడం తెలుగింటి అందాలకు కాస్త కష్టమే! ఇందరి ఇంతుల మధ్య తన కవ్వింతలతో కావ్యంగా నిలిచింది తెలుగు నటి చాందిని చౌదరి. తాజాగా ‘యేవమ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చాందినీ పంచుకున్న కబుర్లు ఇవి..
తెలుగుతెరపై ఉత్తరాది భామల ఊసే ఎక్కువ! ముంబయి ముద్దుగుమ్మలు, తుళు తళుకులను తట్టుకొని
నెగ్గుకురావడం తెలుగింటి అందాలకు కాస్త కష్టమే! ఇందరి ఇంతుల మధ్య తన కవ్వింతలతో కావ్యంగా నిలిచింది తెలుగు నటి చాందిని చౌదరి. తాజాగా ‘యేవమ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చాందినీ పంచుకున్న కబుర్లు ఇవి..
ఆటలంటే నాకు చాలా ఇష్టం. స్కూల్ డేస్‌లో ఖో-ఖో బాగా ఆడేదాన్ని. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నా. క్రీడానేపథ్యం ఉన్న సినిమా చేయాలనుకుంటున్నా! ఎవరైన ఒక క్రీడాకారిణి బయోపిక్‌లో
నటించాలని ఉంది. ఏమవుతుందో చూద్దాం!
పెద్దపెద్ద విజయాలు కూడా చిన్న ప్రయత్నంతోనే ప్రారంభమవుతాయని నమ్ముతాను. 2011లో షార్ట్ ఫిల్మ్‌తో నటిగా నా కెరీర్ మొదలైంది. ఈరోజు వరుస సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నాను. నా మొదటి సినిమా విడుదలై దాదాపు పదేండ్లు అవుతున్నది. ఇన్నేండ్ల నా కష్టానికి ఇప్పుడు తగిన గుర్తింపు లభిస్తున్నది.
వాక్ స్వాతంత్య్రం ఉంది కదా అని.. కొందరు నోటికి వచ్చినట్టు వాగుతుంటారు. సామాజిక మాధ్యమల్లో నాసిరకం ట్రోల్స్ చేస్తుంటారు. లేని విషయాన్ని ఊహించుకొని ఎదుటి వ్యక్తి మనసు గాయపడేలా కామెట్స్ చేస్తుంటారు. అలాంటి ట్రోల్స్‌ను అస్సలు పట్టించుకోను.
చిన్నచిన్న పాత్రలతో తెరకు పరిచయమైన నాకు.. సమ్మతమే, గామి చిత్రాలు మంచి మైలేజీ ఇచ్చాయి. ఓటీటీ కూడా ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. నటిగా ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోవాలన్నదేనా లక్ష్యం.
చిన్నప్పటి నుంచీ నాకు నటన అంటే ఆసక్తి. తెరమీద నన్ను నేను చూసుకోవాలని అనుకునేదాన్ని. ఏడో తరగతి చదువుతున్నప్పుడు అమ్మతో నేను హీరోయిన్ అవుతానని చెబుతుండేదాన్ని. నా స్నేహితుల స్లామ్ బుక్స్‌లో కూడా అలాగే రాసేదాన్ని. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు. చదువుకుంటూనే షార్ట్ఫిల్మ్స్లో నటించాను.
అప్పట్లో షార్ట్ఫిల్మ్స్లో అమ్మాయిలు నటించడం తక్కువ. వాటికి పాపులారిటీ కూడా ఉండేది కాదు. అనుకోకుండా నేను నటించిన షార్ట్‌ఫిల్మ్స్ బాగా హిట్ అయ్యాయి. లక్షల వ్యూస్ కొల్లగొట్టాయి. వాటి ద్వారానే నాకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
సినీ పరిశ్రమలో రాణించాలంటే ఇంత కష్టపడాల్సి వస్తుందని తెలిసి ఉంటే… నేనీ ఫీల్డ్‌లోకి వచ్చేదాన్నే కాదు. ఎవరి సపోర్ట్ లేకుండా సినిమాల్లో అవకాశాలు సంపాదించడం చాలా కష్టం. ఎన్నో అవరోధాలను అధిగమించి ఈ స్థితికి చేరుకున్నాను. ఇన్నేండ్లు పరిశ్రమలో ఉంటానని అస్సలు
ఊహించలేదు.
నాది చాలా చిన్న ప్రపంచం.తెలిసిన వాళ్లతో మాత్రమే మాట్లాడతాను. కానీ, ఇండస్ట్రీలో రాణించాలంటే ఇంట్రావర్ట్‌గా ఉంటే కుదరదు. ఎంతసేపూ నటన గురించే ఆలోచించేదాన్ని! కానీ, హీరోయిన్ కావాలన్న
నా కల నెరవేరాలంటే ఇంతపెద్ద సర్కిల్లో మెలగాలన్న నిజం నాకు అప్పట్లో తెలియలేదు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

