సింపుల్‌గా ఉండటమే ఇష్టం!
అందంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకునే అతికొద్దిమంది తారల్లో ఒకరు దీపికా పదుకొణె. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్.. జానర్ ఏదైనా పాత్రలో ఇట్టే ఒదిగిపోతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ! ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
- కార్వాన్ కబుర్లు
అందంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకునే అతికొద్దిమంది తారల్లో ఒకరు దీపికా పదుకొణె. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్.. జానర్ ఏదైనా పాత్రలో ఇట్టే ఒదిగిపోతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ! ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. వెండితెరపై మెరవాలనే సంకల్పంతో పదిహేడేళ్లకే ముంబయి చేరుకుంది ఈ కన్నడ కస్తూరి. ఎన్నో కష్టాలు, ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. తడబడకుండా నిలబడి ఇండస్ట్రీలో ఎదిగింది. పెళ్లి తర్వాత కూడా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తూ.. ఈతరం హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తున్న దీపిక మనసులోని ముచ్చట్లు!
చిన్నప్పటినుంచే నాకు సినిమాలంటే ఇష్టం. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అంత చిన్న వయసులోనే నేను నా కెరీర్‌కి సంబంధించి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నానా? అని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నటి అవ్వాలనేదే లక్ష్యంగా నా కెరీర్ ప్రారంభించా.
ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోకూడదనేది నా అభిప్రాయం. నా బంధువులు, స్నేహితులు.. ఇప్పటికీ నేను కొంచెం కూడా మారలేదు అంటుంటారు. స్టార్డమ్.. నాలో మార్పు తేనందుకు చాలా సంతోషిస్తాను. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగితే ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కోగలమని నమ్ముతాను.
నాకు, రణ్వీర్ సింగ్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. నేను, చెల్లి చాలా సింపుల్‌గా పెరిగాం. రణ్‌వీర్‌కు కూడా సింపుల్‌గా ఉండటమే ఇష్టం. మా పిల్లలు కూడా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా.. మామూలు పిల్లల్లా ఎదగాలని అనుకుంటున్నాం. అప్పుడే సమాజంలోని పరిస్థితులు, పోరాడేతత్వం అలవడతాయి. స్టార్కిడ్స్గా మా పిల్లల్ని పెంచకూడదని నిర్ణయించుకున్నాం.
హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో అంటే చాలా అభిమానం. టీనేజ్‌లో మా రూమ్నిండా చెల్లి, నేను డికాప్రియో పోస్టర్లనే అంటించేవాళ్లం. టాలీవుడ్లో మహేష్‌బాబు అంటే ఇష్టం. మంచి కథలు, పాత్రల్లో అవకాశం వస్తే తెలుగులో సినిమాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా.
కల్కిలో ప్రభాస్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ సమయంలో ప్రతిరోజూ ప్రభాస్ ఇంటి నుంచే భోజనం వచ్చేది. అది భోజనంలా కాకుండా క్యాటరింగ్‌లా ఉండేది. ప్రభాస్ ఇంటి నుంచి ‘ఈరోజు ఏ స్పెషల్ ఫుడ్ వస్తుందా?’
అని ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉండేది. కల్కి సినిమా సక్సెస్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నా. త్వరలోనే సింగం అగైన్‌తో మీ ముందుకొస్తా!
తొలినాళ్లలో నాకు కనీసం చిన్నగది కూడా ఉండేది కాదు. తెలిసినవాళ్ల దగ్గర, మోడలింగ్ చేసే షూటింగ్ స్పాట్లో ఉండేదాన్ని. రాత్రి పగలు అనే తేడా లేకుండా పని చేస్తూనే ఉండేదాన్ని. డైరెక్టర్ ఫరాఖాన్ దృష్టిలో పడి.. ‘ఓం శాంతి ఓం’ సినిమాలో చాన్స్ వచ్చేవరకూ, నా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

