తూర్పులోనే నీళ్ల సంపు, సెప్టిక్ ట్యాంక్ పెట్టవచ్చా?
పూజగది వెడల్పు, మెట్ల వెడల్పు సమానంగా ఉండాలి. అంటే మెట్లకు రెండు వైపులా రెయిలింగ్ ఉంటుంది. ఆ రెయిలింగ్ కోణం పూజగది ద్వారంలో పడకుండా.. పూజగది ద్వారం సరిగ్గా ఎదురుగా ఉండాలి.
శుభవాస్తు
మెట్లకు ఎదురుగా పూజగది ఉండవచ్చా?: ఆర్. జగన్‌రెడ్డి, మేడిపల్లి
మెట్లకు ఎదురుగా పూజగది రావొచ్చు. కానీ, కొలతలు సరిగ్గా చూసుకోవాలి. ఇంట్లో డూప్లెక్స్ మెట్లు, లిఫ్ట్ వచ్చినప్పుడు ఇలాంటి స్థితి ఎదురవుతుంది. పడమర ఎక్కే మెట్లు ఉన్నప్పుడు, దానికి ఎదురుగా పూజగది తూర్పు గోడకు ఆనించి ఉంచితే దోషం లేదు. పూజగది వెడల్పు, మెట్ల వెడల్పు సమానంగా ఉండాలి. అంటే మెట్లకు రెండు వైపులా రెయిలింగ్ ఉంటుంది. ఆ రెయిలింగ్ కోణం పూజగది ద్వారంలో పడకుండా.. పూజగది ద్వారం సరిగ్గా ఎదురుగా ఉండాలి. పూజగదికి ద్వారం మధ్యలో పెట్టి, ఆ ద్వారం మాత్రం మెట్ల వెడల్పుతో సమానంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మెట్లు ఉండి, మెట్ల మధ్య లిఫ్ట్ నిర్మించినప్పుడు ‘లిఫ్ట్’కు ఎదురుగా కూడా పూజగది కట్టవచ్చు. ఇక్కడ ప్రధానంగా పూజగది ద్వారంలో మెట్ల కోణం పడవద్దు అన్నదే ముఖ్యంగా చూడాలి.

North Road
ఉత్తరంలో రోడ్డు.. ఇంటికి ఎదురుగా రావొచ్చా?: టి. శ్రీను, ఖమ్మం
అందరూ ఉత్తరం వీధి వచ్చినప్పుడు లేదా తూర్పు ఎదురు రోడ్డు వచ్చినప్పుడు భయం లేదు అనుకుంటున్నారు. కానీ, దాని వెడల్పును బట్టి అందులో ఆగ్నేయం లేదా వాయవ్యం భాగం వదిలినప్పుడే.. ఆ రోడ్డు మంచిది అవుతుంది. తూర్పు అంటే.. ఆ దిశలో తూర్పు-ఆగ్నేయం కలుపుకొని కాదు. ఆ మూల వదిలి పడే రోడ్డు కొలతను బట్టి అది తూర్పు పడుతుందా? తూర్పు-ఆగ్నేయం కూడా కలుపుకొని పడుతుందా? అనేది సరిగ్గా నిర్ధారించాలి. స్థలంలో కొలతలు వేసి చూడాలి. అందరూ తూర్పు వీధిచూపు, ఉత్తరం వీధిచూపు అంటున్నారు. కానీ, అందులో ఆగ్నేయం, వాయవ్యం ఉన్నాయా? లేదా అన్నది చూడటం లేదు. ఇంటికి ఎదురుగా ఉత్తరం ఇంటి వెడల్పుతో రోడ్డు వచ్చి పడితే.. అది వీధిచూపు కాదు. వీధిపోటు అవుతుంది. అలాగే, దిశలు సరిగ్గా నిర్ణయం చేయకుండా వీధిపోట్లు నిర్ణయించడం కుదరదు. ఇలాంటివి జాగ్రత్తగా చూడాలి.

Penthouse
ఇంటిమీద పెంట్‌హౌస్ కట్టాము. దానిమీదికి వెళ్లడానికి రౌండ్ మెట్లు ఎక్కడ పెట్టాలి?: డి. పద్మ, రాయగిరి
ఇంటిమీద (టెర్రస్ పైన) కట్టే చిన్న ఇంటిని పెంట్‌హౌస్ అంటారు. సహజంగా ఇంటికి ఉండే ప్రధాన మెట్లు దానికి పనిచేయవు. అందుకు అదనంగా రౌండు మెట్లు లేదా నిచ్చెన (ఇనుప లాడర్) వేసుకొని వాడుతుంటారు. ఇంటి మీద కట్టిన ఆ ఉపగృహానికి మెట్లు కావాలంటే.. అక్కడ స్థలాన్ని బట్టి రౌండు మెట్లు లేదా అందరూ వెళ్లేలా (డాగ్లెగ్ మెట్లు) ఐరన్‌తో కూడా వేసుకోవచ్చు. అయితే, అవి ఆగ్నేయంలో కానీ, వాయవ్యంలో కానీ వేసుకోవాలి. తూర్పులో, ఈశాన్యంలో, ఉత్తరంలో వేయవద్దు. వాయవ్యంలో ఆ రౌండు మెట్లు వేసినట్లయితే.. దానినుంచి పైకి వెళ్లి, పైన ఉండే బాల్కనీ నుంచి ఉత్తర ఈశాన్యం నుంచి పైన భాగంలోకి వెళ్లాలి. అప్పుడు ఆ చోట సవ్యమైన నడక ఏర్పడుతుంది. అది సరైన విధానం. వాయవ్యం నుంచి వాయవ్యంలోకి డైరెక్టుగా వెళ్లకూడదు.

Septic Tank
తూర్పులోనే నీళ్ల సంపు, సెప్టిక్ ట్యాంక్.. రెండూ పెట్టవచ్చా?: పి. శ్రీరామ్, శనిగచర్ల
పెట్టవచ్చు. కానీ, సరిగ్గా విభజించాలి. ఇంటి పరిసరాలలో డ్రైనేజీ సిస్టమ్ లేనప్పుడు, మురుగు కాలువల వ్యవస్థ ఇంకా రానప్పుడు కొన్ని ప్రాంతాలలో ఇంటి ఆవరణలోనే సెప్టిక్ ట్యాంక్ పెట్టాల్సి వస్తుంది. తూర్పులో ఉన్న ఖాళీ స్థలంలోనే నీళ్ల సంపు, సెప్టిక్ ట్యాంక్ రావాలి అంటే.. రెండిటి మధ్య దూరం ఉండాలి. అలాగే, తూర్పు-ఆగ్నేయంలో ఏ గొయ్యీ రాకూడదు. దక్షిణం, ఉత్తరం పొడవుగా ఉన్న ఇంటి ఆవరణలో అంటే.. ఇల్లు దీర్ఘ చతురస్రంగా కట్టినప్పుడు కుదురుతుంది. తగిన స్థలం ఉంటుంది. ఇంటిలో భూమి లోపలికి గొయ్యి ఉండాలి అంటే.. తూర్పు లేదా ఉత్తర భాగం మాత్రమే ఉండాలి. మీరు తూర్పు స్థలాన్ని కొలిచి, అటు ఈశాన్యం, ఇటు ఆగ్నేయం వదిలి, తూర్పులో రెండూ ప్లాన్ చేయండి. రెండిటి మధ్య పదిహేను అడుగులు ఎడం ఉండాలి. లేదా సెప్టిక్ ట్యాంక్‌ను ఉత్తరం మధ్యకు తీసుకెళ్లండి. సెప్టిక్ ట్యాంక్ వాటర్ లీక్ లేకుండా ఆర్సీసీతో కట్టండి.
– సుద్దాల సుధాకర్ తేజ, suddalavasthu@gmail.com, 98492 78143
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

