ప్రజల చెంతకు పాలన
అధికారం వికేంద్రీకృతమైతే పాలన చేరువవుతుంది. పాలన చేరువైతే అభివృద్ధి వేగం అందుకుంటుంది. ఇదే లక్ష్యంతో కేసీఆర్ చేసిన ప్రయోగం విజయవంతమైంది. పదేండ్ల క్రితం వరకు ఒకొక్క తెలంగాణ జిల్లా విస్తీర్ణం...
అధికారం వికేంద్రీకృతమైతే పాలన చేరువవుతుంది. పాలన చేరువైతే అభివృద్ధి వేగం అందుకుంటుంది. ఇదే లక్ష్యంతో కేసీఆర్ చేసిన ప్రయోగం విజయవంతమైంది. పదేండ్ల క్రితం వరకు ఒకొక్క తెలంగాణ జిల్లా విస్తీర్ణం… యూరప్ దేశంలోని ఒకటి రెండు దేశాలకు సమానంగా ఉండేవి. జిల్లా కేంద్రాల్లోని అధికార వర్గం మారుమూల ప్రాంతాలను వెళ్లడం, అక్కడి సమస్యలను వినడం అనేది ఒక బ్రహ్మ పదార్థంగా ఉండేది. శనిగరం వద్ద ప్రారంభమయ్యే కరీంనగర్ జిల్లా పశ్చిమ కొన గంభీరావ్పేట్ మండలంగా ఉంటే, తూర్పు కొన కాళేశ్వరంగా ఉండేది. వీటి మధ్య అంతరాన్ని పరిశీలిస్తే అచ్చంగా 210 కిలోమీటర్లు. ఇక చెన్నూరు నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 196 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. జిల్లా కేంద్రాలే కాదు, డివిజన్ కేంద్రాలకు వెళ్లాలన్నా దూరభారంతో కూడుకున్నదిగానే ఉండేది. జిల్లా కేంద్రాలకు సుదూరంగా ఉన్న ప్రాంతాలు అభివృద్ధికీ ఆమడ దూరంలో నిలిచిపోయాయి. ఒక్క కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలే కాదు.. తెలంగాణలోని పది జిల్లాల్లోనూ అదే పరిస్థితి.
సువిశాల స్థలంలో విస్తరించిన జిల్లాలల్లో ప్రజల ఆర్థిక స్థితిగతులు మొదలుకొని భాష, సంస్కృతిల్లోనూ వ్యత్యాసం కనిపించే పరిస్థితి. విద్య, వైద్యం, ఆర్థిక పరిపుష్ఠి కలిగిన ప్రజలు ఒకవైపు, ఆర్థిక వెనకబాటు, ఉపాధి కరువైన ప్రజలు మరొకవైపు.. ఒకే జిల్లాలో సాగిన విచిత్ర పరిస్థితి. జిల్లాను యూనిట్‌గా తీసుకొని నిర్వహించే డీఎస్సీ లాంటి పరీక్షల్లో 85 శాతం స్థానికత కోటాలో జిల్లా, డివిజన్ కేంద్రాలకు చెందిన వారే అధికంగా ఉద్యోగాలు పొందేవాళ్లు. వెనుకబడిన పల్లెలు, తండాలకు చెందిన అభ్యర్థులు తమ జిల్లాలోని జిల్లా, డివిజన్ కేంద్రాలకు చెందిన వారితో పోటి పడలేక ఉద్యోగాలు సైతం పొందలేని దుస్థితి. ఈ వ్యత్యాసాలు రూపుమాపాలని జిల్లాల పునర్విభజన చేపట్టారు కేసీఆర్. ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ మారుమూల పల్లె నుంచి జిల్లా కేంద్రం గరిష్ఠ దూరం 70 కిలోమీటర్లకు మించదు. అంతటి పక్కా లెక్కతో జిల్లాలకు రూపకల్పన చేశారు కేసీఆర్.
జిల్లా కేంద్రాలతో పాటు, కొత్తగా ఏర్పాటైన జిల్లాలో రెవెన్యూ డివిజన్లూ కొత్తగా వచ్చాయి. కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు హామ్లెట్ (అనుబంధ) గ్రామాలుగా ఉన్న తండాలు, చిన్న గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇలా ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరగడంతో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వెళ్లేందుకు మార్గాలు సుగమం అయ్యాయి. ఇబ్బందిలేని, ఆర్థిక వ్యయం లేని పరిస్థితులు ఆవిష్కృతమయ్యాయి. 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలకు చేరుకుంది. రెవెన్యూ డివిజన్లు 42 ఉండగా, ప్రస్తుతం 80 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. మండలాల సంఖ్య 430 నుంచి 621కి చేరింది. గ్రామ పంచాయతీల సంఖ్య 12,760కి పెరిగింది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

