రొమ్ము క్యాన్సర్ రహస్యం!

రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న తరువాత కూడా, వ్యాధి మళ్లీ ఎందుకు తిరగబెడుతుందో తెలిసిపోయింది. కొన్ని క్యాన్సర్ కణాలు ‘స్లీపర్ మోడ్’లోకి వెళ్లిపోయి, కొన్నేండ్ల తరువాత మళ్లీ యాక్టివ్‌గా మారడమే ఇందుకు కారణమని కనుగొన్నారు లండన్ పరిశోధకులు. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే హార్మోన్ థెరపీ మందుల గురించి అధ్యయనం చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో హార్మోన్ థెరపీ చాలా సమర్థవంతమైంది. అయితే, క్యాన్సర్ కణాలను ఒకవైపు చంపుతూనే మరోవైపు కొన్ని కణాలను చైతన్య రహితంగా చేసి స్లీపర్ స్థితిలోకి చేరుస్తున్నాయి ఈ మందులు. ఈ కణాల నిద్రాణ స్థితి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించగలిగితే క్యాన్సర్ మళ్లీ రాకుండా నివారించడం సాధ్యమవుతుందంటున్నారు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ క్యాన్సర్ విభాగానికి చెందిన డాక్టర్ ల్యూకా మాగ్నాని. నిద్రాణ స్థితిలోకి వెళ్లిన క్యాన్సర్ కణాలను శాశ్వతంగా అదే స్థితిలో ఉంచడం లేదా, వాటిని యాక్టివ్ చేసి చంపడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు. ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Breast Cancer
- Secret
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

