నాకు ఇప్పటికే స్టంట్ వేశారు… ఇప్పుడు నేను వయాగ్రా వాడొచ్చా?
నమస్తే డాక్టర్! నా వయసు 57 ఏండ్లు. ఈ మధ్యే అంగస్తంభన సమస్య మొదలైంది. నాకు ఇప్పటికే హార్ట్ స్టంట్ వేశారు. ఇప్పుడు నేను వయాగ్రా వాడవచ్చా? మా బావగారికి బీపీ ఉన్నప్పటికీ, మెడికల్ షాప్‌లో కొనుక్కుని వాడతారు. నన్నూ వాడమని సలహా ఇస్తున్నారు. సెక్స్ హార్మోన్స్ ఇంజెక్షన్లు (టెస్టోస్టిరాన్) వాడవచ్చా?
– ఓ పాఠకుడు
మీ బావగారు డాక్టర్ కాదు. బీపీ పెట్టుకొని వైద్యుల పర్యవేక్షణ లేకుండానే వయాగ్రా లాంటి ప్రమాదకర మందును వాడుతున్నారు. మిమ్మల్ని కూడా వాడమంటూ తప్పుడు సలహా ఇస్తున్నారు. ముందు ఆయన్నే వయాగ్రా మానేయమని చెప్పండి. బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వయాగ్రా వాడకూడదు.
ముందుగా మీకు అంగస్తంభన సమస్యకు ఇతర కారణాలు (ఉదా: డయాబెటిస్, బీపీ, లివర్, కిడ్నీ, ప్రొస్టేట్ లాంటి వ్యాధులు) ఏమైనా ఉన్నాయేమో కనుక్కోవాలి. అయితే, ఇప్పటికే మీకు స్టంట్ వేశారు కాబట్టి.. గుండె జబ్బువల్లే ఈ సమస్య వచ్చినట్లు ఉన్నది. కాబట్టి, మీరు వయాగ్రా జోలికే వెళ్లకండి.
ఎందుకంటే.. జీవితం కంటే శృంగారం ముఖ్యం కాదు కదా? వయాగ్రా వేసుకోవడం వల్ల హఠాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. బీపీ ఉన్నవాళ్లు కూడా వయాగ్రా వేసుకుంటే అంతే! ముందుగా మీరు మీ భార్యతో కలిసి సెక్సాలజిస్టును కలవండి. మెరైటల్ థెరపీ తీసుకోండి. ఇందులో చెప్పే కొన్ని సూచనలు పాటించడం వల్ల గుండెపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ శృంగారంలో పాల్గొనవచ్చు. కొన్ని ప్రాకృతిక మందులు, వైద్య లక్షణాలున్న ఆహార పదార్థాలు వాడుకుంటూ, మీ ఆరోగ్యం చెడకుండా మంచి శృంగార జీవితాన్ని పొందవచ్చు. ఇక ‘టెస్టోస్టిరాన్ హార్మోన్ల ఇంజెక్షన్లు వేసుకోవచ్చా?’ అని అడుగుతున్నారు.
యాభై ఏండ్లు దాటినవారిలో రక్తంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయి తగ్గుతూ వస్తుంది. రక్తంలో టెస్టోస్టిరాన్ తగ్గితే కచ్చితంగా అంగస్తంభన సమస్య వస్తుంది. మీకు ఇప్పటికే 57 ఏండ్లు. అయితే, ప్రతి మి.లీ. రక్తంలో 3 నానోగ్రాముల కంటే తక్కువ ఉన్నవాళ్లే.. ఈ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఒక్కోసారి ఈ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ల స్థాయి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఒకసారి ఆండ్రాలజిస్టు పర్యవేక్షణలో రక్త పరీక్ష చేయించుకోండి. ఆ ఫలితాల ఆధారంగా, ఆండ్రాలజిస్టు సలహా మేరకే టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ వేయించుకోండి.
డా. భారతి (ఎమ్మెస్)
మారిటల్ కౌన్సిలర్, సైకోథెరపిస్ట్,
జయా హాస్పిటల్
బీ.ఎన్. రెడ్డి నగర్ క్రాస్‌రోడ్, హైదరాబాద్
bharathid506@gmail.com, 7989227504
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Heart disease
- Viagra
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

