ఆదుకునే విజిల్.. మడతపెట్టే మౌస్
ఆదకునే విజిల్, మడతపెట్టే మౌస్ ఏమిటని అనుకుంటున్నారా. ఇవి కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు. ఇవేకాదు చిటికెలో కాఫీ తయారు చేసే మెషిన్, నీళ్లు లేకుండానే శుభ్రం చేసే గాడ్జెట్లు కూడా ఉన్నాయి. ఈ వారం నయామాల్లో అందిస్తున్న కొత్త ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి తెలుసుకుందాం.
నయా మాల్
ఆదుకునే విజిల్
అడవుల్లో ట్రెక్కింగ్‌కి వెళ్లేవారు, మౌంటెనీరింగ్ చేసేవారు, మారథాన్ రన్నర్లు.. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే కొన్ని నమ్మదగిన గ్యాడ్జెట్స్‌ను వెంట ఉంచుకోవాల్సిందే! అలాంటి వాటిలో NITECORE NWE10 Electronic Emergency Whistle తప్పకుండా ఉండాల్సిన గ్యాడ్జెట్. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేలా నైట్‌కోర్ సంస్థ రూపొందించిన ఒక అధునాతన ఎలక్ట్రానిక్ సేఫ్టీ విజిల్ ఇది. సాధారణ విజిల్స్‌లా దీన్ని గట్టిగా ఊదాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు.. శక్తిమంతమైన శబ్దాన్ని విడుదల చేస్తుంది. గరిష్ఠంగా 126 డెసిబెల్స్ శబ్దం ఉత్పత్తి అవుతుంది. 3,300 Hz సౌండ్ ఫ్రీక్వెన్సీ వల్ల ఈ శబ్దం చాలా దూరం వరకు వినిపిస్తుంది. ఇతరుల దృష్టిని సులభంగా ఆకర్షిస్తుంది. ఇందులో సాధారణ అలర్ట్ సౌండ్‌తోపాటు SOS , BEACON మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని 300 ఎంఏహెచ్ బ్యాటరీ 80 గంటలపాటు బ్యాకప్ అందిస్తుంది. చలికాలంలో లేదా మంచు ప్రదేశాలలో -40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లోనూ ఇది సమర్థంగా పనిచేస్తుంది. ఐపీఎక్స్-7 వాటర్‌ఫ్రూఫ్ రేటింగ్ ఉండటం వల్ల.. వర్షంలో తడిచినా, పొరపాటున నీటిలో పడినా పాడవకుండా ఉంటుంది.
– ధర: రూ.2000, దొరుకుచోటు: nitecore.com

Emergency Whistle
చిటికెలో చిక్కటి కాఫీ
కాఫీ ప్రియులు.. రోజుకు రెండుమూడు కప్పులైనా లాగించేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా కాఫీ మేకింగ్ యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే, ట్రావెలింగ్, క్యాంపింగ్ చేసేటప్పుడు కాఫీని ఎక్కువగా మిస్ అవుతుంటారు. అలాంటి బాధలు లేకుండా.. ఫ్యాంటిక్ సంస్థ అత్యంత అధునాతనమైన Fanttik Cafein 11 Portable Espresso Machineను తీసుకొచ్చింది. ఇది కేవలం కాఫీని తయారు చేయడంతోపాటు నీటిని వేడి చేసుకునేందుకూ ఉపయోగపడుతుంది. పరిమాణంలో చిన్నగా ఉన్నా.. శక్తిమంతమైన 20-బార్ ప్రెషర్‌ను సృష్టిస్తుంది. దీనివల్ల కాఫీలోని అసలైన సువాసన, రుచి పూర్తిగా వెలుపలికి వచ్చి.. కేఫ్‌లలో లభించేలా చక్కటి ‘క్రీమా’తో కూడిన ఎస్ప్రెస్సో లభిస్తుంది. ఇందులోని ప్రీ-సోక్ ఫీచర్.. కాఫీ పొడి అంతటా సమానంగా నీరు వెళ్లేలా చేసి మరింత సువాసనభరితమైన కాఫీని అందిస్తుంది. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే.. వేడినీటిని వాడి ఏకంగా 500 కప్పుల వరకూ ఎస్ప్రెస్సోను పొందవచ్చు. సొంతంగా గ్రైండ్ చేసుకున్న కాఫీ పౌడర్‌తోపాటు మార్కెట్లో దొరికే Nespresso Original క్యాప్సూల్స్‌ను కూడా ఇందులో ఉపయోగించవచ్చు.
– ధర: రూ. 13,000, దొరుకుచోటు: fanttik.com

Fanttik Cafein
నీళ్లు లేకుండానే క్లీన్‌గా..
‘సూపర్ ఎల్‌నినో’తో నీటి కొరత మరింత తీవ్రమైంది. పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ కరువు రాజ్యమేలుతున్నది. ఈ క్రమంలో ఇల్లు, కార్లు, ఇతర పరికరాలపై దుమ్ము పడితే.. నీటితో శుభ్రం చేయలేని పరిస్థితి నెలకొన్నది. అయితే, ఈ FLEXTAIL Max Blast 300 Electric Air Duster కొనుగోలు చేస్తే.. క్లీనింగ్ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది. ఇందులోని బ్రష్‌లెస్ మోటార్.. నిమిషానికి ఏకంగా 1,50,000 సార్లు తిరుగుతుంది. సెకనుకు 90 మీటర్ల వేగంతో గాలిని విడుదల చేసి, అత్యంత కఠినమైన ధూళిని కూడా ఎగదోస్తుంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ.. సుమారు 300 గ్రాముల బ్లోయింగ్ ఫోర్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంట్లోని ఫర్నీచర్, కార్లపై పడిన దుమ్మును కూడా సులభంగా తొలగిపోతుంది. కంప్యూటర్ కీబోర్డులు, సీపీయూ లోపలి భాగాలు, కార్ డ్యాష్బోర్డ్లనూ క్లీన్ చేస్తుంది.
– ధర: రూ. 6,900, దొరుకుచోటు: flextail.com

Flextail Max Blast
మౌస్.. మీ వెంటే!
టెక్నాలజీ రంగంలో సుపరిచితమైన లాజిటెక్.. అవసరాలకు తగ్గట్టుగా వినూత్నమైన గ్యాడ్జెట్లను పరిచయం చేస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి, ఆఫీసు పనిలో బిజీగా ఉండే వారికి.. అత్యంత ఉపయోగకరంగా ఉండేలా Logitech Mobi Fold Foldable Wireless Mouseను తీసుకొచ్చింది. ఈ మౌస్ ప్రత్యేకత.. ఫోల్డబుల్ డిజైన్. సాధారణంగా మౌస్‌లను బ్యాగుల్లో సర్దుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఈ మొబి ఫోల్డ్ మౌస్‌ను సులభంగా మడతపెట్టి.. ప్యాకెట్లో లేదా చిన్న పర్సులో కూడా పెట్టుకోవచ్చు. ఇందులో టచ్ ఆధారిత స్క్రోలింగ్.. లైన్-బై-లైన్ కచ్చితత్వంతోపాటు వేగవంతమైన నావిగేషన్‌ను అందిస్తుంది. ఇక ల్యాప్‌టాప్ ట్రాక్‌ప్యాడ్‌తో పోలిస్తే ఈ మౌస్‌ని వాడటం వల్ల చేతి నరాల మీద పడే ఒత్తిడి దాదాపు 22% వరకు తగ్గుతుందని లాజీటెక్ చెబుతున్నది. ఈజీ-స్విచ్ బటన్ ద్వారా ఒకే సమయంలో మూడు వేర్వేరు డివైజెస్‌ను కనెక్ట్ చేసి, కేవలం ఒక బటన్ క్లిక్‌తో వాటి మధ్య కనెక్షన్‌ను మార్చుకోవచ్చు.
– ధర: రూ. 35,000, దొరుకుచోటు: అమెజాన్

Foldable Wireless Mouse
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- fold mouse
- nayamall
- Rescue
- whistle
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

