త్రిమూర్తి బలుడు.. కృషీవలుడు.. నాగలితో అక్షరాలు దిద్దుతాడు
గంగుల శాయిరెడ్డి రచించిన ‘కాపు బిడ్డ’ అనే కావ్యంలో కర్షక జీవితాన్ని గురించి వర్ణించారు. ఆయనిది పూర్వ వరంగల్ జిల్లా రామచంద్రగూడెం. ఆ కావ్యంలోని పద్యాన్ని, అర్థాన్ని తెలంగాణ ప్రబంధ పరిమళంలో అందిస్తున్నాం.
తెలంగాణ ప్రబంధ పరిమళం
సీ॥ విధివలె బీజముల్ విత్త నాగలి గట్ట
చదువుల పడతి నీ సరస నిలుచు
హరివలె సస్యాదు లరయుచు బోషింప
కలుముల చెలియ నీ కడను నిలుచు
ప్రళయ కాలుని వలె పైరులు గోయింప
బలమిచ్చు శక్తి నీప్రక్క నిలుచు
సత్త్వాది గుణముల సత్వము ప్రకటింప
ముగురు మూర్తుల తోడ త్రిగుణ సతులు
తే.గీ॥ కాపులై పైరు బెట్టుచు కాచి కోయ
నవతరించిరి గాబోలు నవని పైన
గాన వారి యనుకృతి బూనినట్టి
సైరికాసతీపతులను సంస్మరింతు
ఈ పద్యం గంగుల శాయిరెడ్డి గారి ‘కాపు బిడ్డ’ అనే కావ్యం లోనిది. పూర్వ వరంగల్ జిల్లా రామచంద్రగూడెంలో 1890 వ సంవత్సరంలో జన్మించిన వీరు కర్షకుడు, కవి, స్వాతంత్య్ర సమర యోధుడు. కర్షక జీవితాన్ని కండ్లకు కట్టినట్టుగా చూపుతుంది ఈ కావ్యం. కర్షక ప్రశంస ఇది. త్రిమూర్తులతో కర్షకుడిని పోలుస్తున్నాడు కవి. ‘విధి వలె బీజముల్ విత్తడం’ అంటే బ్రహ్మ సృష్టించినట్లు ఒక కొత్త సస్య సౌందర్యం నిర్మించడానికి విత్తనాలు చల్లి నాగలి కడితే సరస్వతి నీ పక్కన నిలుస్తుంది. నాగలితో రైతు అక్షరాలు దిద్దుతాడని అంతరార్థం కాగా, మంచి పంటలు పండితే రైతు తన పిల్లలను చక్కగా చదివించుకోగలుగుతాడు. సృష్టి స్థితిని పోషించే విష్ణుమూర్తిలా పంటలను కాపాడుకుంటే సిరులు నీ చెంత నిలుస్తాయి. ధాన్యలక్ష్మి నీ వద్దే ఉంటుంది.
ప్రళయ కాల రుద్రుని వలె కాసిన పంటను కోస్తుంటే అమ్మ పార్వతి నీకు బలమిచ్చే శక్తిలా నీ పక్కన నిలుస్తుంది. ఆమె సర్వమంగళ కాబట్టి పంట బాగా చేతికందితే అన్ని శుభాలు పొందగలమని భావన. ఇలా పంట అభ్యున్నతికి త్రిమూర్తుల సాత్విక రాజస తమో గుణాలు కల సతీమణులుగా నిరంతరం కాపుకాస్తారు (రక్షిస్తారు). విత్తడం, పెంచడం, కోయడం అనే మూడు కృత్యాలు వారే చేస్తారు. వారి అనుకృతి గల రైతుకు నమస్కరిస్తున్నాను. అనుకృతి అంటే పోలిక. త్రిమూర్తుల కృత్యాలను పోలిన విధులు నిర్వహిస్తున్న రైతుకు నమస్కరిస్తున్నాను అని రైతును కవి ప్రశంస చేస్తున్నారు.
– చేపూరి శ్రీరాం, హన్మకొండ
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవిష్యత్ బీఆర్ఎస్దే
క్యాన్సర్ జయించిన చిన్నారులతో వేడుకలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

