Actor Haritha | చిన్న శాంతి అనేవారు!
తెరపై ఆమె అమాయకత్వం అందరితో కంటతడి పెట్టిస్తుంది. నిప్పులు చెరుగుతున్నట్టుండే ఆమె కండ్లు ఆత్మవిశ్వాసం గల స్త్రీని గుర్తు చేస్తాయి.. ముఖ కవళికలతోనే భావాలు పలికించడం ఆమెకే సాధ్యమయింది.
తెరపై ఆమె అమాయకత్వం అందరితో కంటతడి పెట్టిస్తుంది. నిప్పులు చెరుగుతున్నట్టుండే ఆమె కండ్లు ఆత్మవిశ్వాసం గల స్త్రీని గుర్తు చేస్తాయి.. ముఖ కవళికలతోనే భావాలు పలికించడం ఆమెకే సాధ్యమయింది. నిన్నటి ‘చిన్న శాంతి’ అయితేనేమీ, నేటి ‘హరిత’ అయితేనేమీ ప్రేక్షకుల మదిలో ఆమెకున్న స్థానం ప్రత్యేకం. అన్న చాటు చెల్లిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు 30 ఏండ్ల నట ప్రస్థానం కలిగిన హరిత ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..

అమ్మానాన్నలకు మేం ముగ్గురం సంతానం. చిన్నప్పట్నుంచీ అన్నయ్య విజయ్, చెల్లి రవళి (హీరోయిన్), నేను సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. అన్నయ్యకు నటన అంటే చాలా ఇష్టం. సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటున్న అన్నయ్య కోసం మేం చెన్నైకి మకాం మార్చాం. కూచిపూడి, భరతనాట్యం, సంగీతం చిన్నప్పుడే నేర్చుకున్నా. నటన ఇంట్లోనే సాధన చేశా. పదోతరగతి అవగానే సినిమాలో అవకాశం వచ్చింది. అమ్మానాన్న ప్రోత్సాహంతోనే పరిశ్రమలో అడుగుపెట్టా. అల్లు అరవింద్ గారు నిర్మించిన ‘డబ్బు పెద్ద జబ్బు’ నా మొదటి సినిమా. అప్పుడు నాకు పదహారేండ్లు. తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా నా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
తేడా ఉండేది కాదు
‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’, ‘చినరాయుడు’, ‘దొంగ పోలీస్’, ‘పేకాట పాపారావు’లో నటించాను. దాదాపు సీనియర్ హీరోలందరితో స్క్రీన్ పంచుకున్నాను. అంత గొప్ప వ్యక్తులు ఇప్పటికీ నన్ను గుర్తు పెట్టుకొని పలుకరిస్తుంటారు. అది వారి మంచితనానికి ప్రతీక. నా అసలు పేరు శాంతి. సీరియల్స్‌లోకి వచ్చాక హరితగా పేరు మార్చుకున్నా. ‘చినరాయుడు’ చేస్తున్నప్పుడు అందరూ విజయశాంతిని, నన్నూ.. పెద్దశాంతి, చిన్నశాంతి అని పిలిచేవారు. ఆ షూటింగ్ టైంలో నా పుట్టినరోజు రావడంతో ఇంటికి వెళ్తానని ఏడ్చాను. విజయశాంతి ఓదార్చి పంపించారు. హీరో, హీరోయిన్ అనే తేడా లేకుండా అందరం కలిసి తినేవాళ్లం. బ్రేక్‌లో కబుర్లు చెప్పుకొనేవాళ్లం. కోదండ రామిరెడ్డి గారైతే ఆవకాయ అన్నం కలిపి అందరికీ ముద్దలు పెట్టేవారు.
బెంగాలీ, మరాఠీలోనూ
దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో నటించాను. ఓ బెంగాలీ, మరో మరాఠీ సీరియల్తోపాటు తమిళ్ సీరియల్స్‌లో ఎక్కువ రోల్స్ చేశాను. తొలినాళ్లలో ‘సంఘర్షణ’, ‘వైదేహి’ సీరియల్స్‌తో గుర్తింపు వచ్చింది. దాదాపు 80 సీరియల్స్‌లో హీరోయిన్గా చేశాను. పెండ్లి, పాప పుట్టడం వల్ల మూడేండ్లు గ్యాప్ తీసుకున్నా. ప్రస్తుతం ‘అబ్బాయి’, ‘పద్మావతి కల్యాణం’ సీరియల్స్ చేస్తున్నాను. ‘ముద్దమందారం’ నా కెరీర్లో ఓ మైలురాయి. అభిమానుల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటా.
కుటుంబం ప్రత్యేకం
మా అన్నయ్య, జాకీ గారూ స్నేహితులు. ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించారు. జాకీకి, నాకు పెండ్లి చేస్తే బాగుంటుందని అన్నయ్య అనుకున్నారు. అప్పటికే మమ్మల్ని తెరపై చూసినవాళ్లు జంట బాగుందనేవాళ్లు. మాది ప్రేమ వివాహం కాదు, పెద్దలు కుదిర్చిన పెండ్లి. అభిరుచులు కలవడంతో ఆనందంగా జీవిస్తున్నాం. ఎంత బిజీగా ఉన్నా రాత్రి భోజనం కలిసే చేస్తాం. ఆయన ప్రోత్సాహంతోనే మళ్లీ నటిస్తున్నా. నా గెటప్స్, కాస్టూమ్స్ అన్నీ ఆయనే చూసుకుంటారు. మాకు ఇద్దరు పిల్లలు, బాబు మృదుల్, పాప సంస్కృతి. ప్రస్తుతానికైతే చదువుకుంటున్నారు.. నటనపై వారికి ఆసక్తి లేదు.
– హరిణి
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

