నాన్నకు తగిన కూతురు
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) సరికొత్త సంచలనం. పేరుకు తగ్గట్టే కిక్ బాక్సింగ్ నుంచి కుస్తీ వరకు రకరకాల క్రీడల మేళవింపు ఇది. మన దేశంలో ఈ వినూత్నమైన కళను ప్రోత్సహిస్తున్నది ఎవరో కాదు.. జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) సరికొత్త సంచలనం. పేరుకు తగ్గట్టే కిక్ బాక్సింగ్ నుంచి కుస్తీ వరకు రకరకాల క్రీడల మేళవింపు ఇది. మన దేశంలో ఈ వినూత్నమైన కళను ప్రోత్సహిస్తున్నది ఎవరో కాదు.. జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్. ఆ ప్రయత్నంలో భాగంగా అన్న టైగర్ ష్రాఫ్‌తో కలిసి ‘మాట్రిక్స్ ఫైట్ నైట్’ పేరుతో పోటీలు మొదలుపెట్టారు.
మొదట్లో మహా అయితే వెయ్యిమంది ముందు ప్రదర్శితమైన ఈ క్రీడ, ఇప్పుడు వేలకొద్దీ అభిమానులను సంపాదించుకున్నది. గత ఏడాది జరిగిన పోటీలకు ఐదొందలమంది ఆటగాళ్లు ముందుకొచ్చారంటేనే.. మాట్రిక్స్ ఫైట్ నైట్ సత్తా అర్థం చేసుకోవచ్చు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కోసమే ఓ జిమ్ కూడా స్థాపించారు కృష్ణ. ఈ విషయంలో తన అన్న సహకారం ఎంతో ఉందని చెబుతారు.
టైగర్ ష్రాఫ్ హీరోగా గుర్తింపు పొందేందుకు ‘మిక్స్డ్’ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడిందనీ, ఆ అభిమానంతోనే తను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌ను ప్రోత్సహించేందుకు సిద్ధపడ్డానంటారు కృష్ణ. అసక్తి ఉన్నవారికి తమ జిమ్‌లో శిక్షణనిస్తూ, పరోక్షంగా సీనియర్లకు ఉపాధినిస్తున్నారు. నిరంతర సాధన వల్ల శారీరకంగా, మానసికంగా రాటుదేలతామని భరోసా ఇస్తారు. ఈ క్రీడను జనంలోకి తీసుకెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తాననీ ప్రకటిస్తారు కృష్ణ.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

