ఏవీఎమ్ సిస్టర్స్
చెన్నైలోని ఏవీఎమ్ స్టూడియో గురించి తెలియనివారు ఉండరు. అనేక తెలుగు సినిమాలు అక్కడ రూపుదిద్దుకున్నాయి.
చెన్నైలోని ఏవీఎమ్ స్టూడియో గురించి తెలియనివారు ఉండరు. అనేక తెలుగు సినిమాలు అక్కడ రూపుదిద్దుకున్నాయి. ఏవీ మయ్యప్పన్ అనే సినిమా ప్రేమికుడు ఏడున్నర దశాబ్దాల క్రితం ఈ ఆవరణకు ప్రాణం పోశాడు. పెద్దాయనకు ఫిల్టర్ కాఫీ అంటే ఎంతిష్టమో, స్టూడియో అన్నా అంత ప్రాణం. ప్రస్తుతం ఆయన మునిముని మనవరాళ్లు అపర్ణ, అరుణా గుహ ఏవీఎమ్ స్టూడియోను నిర్వహిస్తున్నారు. నాలుగు తరాల వారసత్వ విలువలను కాపాడుకుంటూనే డిజిటల్ వినోద రంగంలోకి కూడా ప్రవేశించారు.
స్టూడియో మూలమూలనా కనిపించే పాత కెమెరాలు, రీళ్లు, లైటింగ్ ఎక్విప్మెంట్, ప్రొజెక్టర్లు చూసినప్పుడు ఆ అక్కాచెల్లెళ్లకు ఓ ఆలోచన వచ్చింది. వాటన్నిటినీ ఓ చోట పేర్చి.. మ్యూజియం ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్రతి పరికరం ఓ చారిత్రక మలుపునకు సాక్ష్యమే. దుమ్ము, ధూళి ఇబ్బంది పెడుతున్నా ఆ పాత సామాన్లను ముందేసుకుని కూర్చున్నారు. ఏయే సినిమాలకు వాడారన్నదీ పాత రికార్డులు వెతికి కనిపెట్టారు. మొత్తానికి అనుకున్నది సాధించారు. మ్యూజియం సిద్ధం చేశారు. ‘ఏవీఎమ్ను నవతరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది’ అని చెబుతారు అరుణ, అపర్ణ.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

