పచ్చ కప్ప
ఒక అడివిలున్న మడుగుకాడ.. ఒక కప్పల బలుగం బతుకుతుండేది. అండ్ల ఒక కప్పకు ఒక కొడుకు ఉన్నడు. పాపం ఆ కప్ప పెనిమిటి.. పోయిన ఆనకాలం చెడగొట్టు ఆనలకు చెట్టు కొమ్మిరిగి మీదవడి జీవమిడిశిండు. గందుకే.. కొడుకును గావురంగ వెంచుకుంటంది తల్లి కప్ప.
ఒక అడివిలున్న మడుగుకాడ.. ఒక కప్పల బలుగం బతుకుతుండేది. అండ్ల ఒక కప్పకు ఒక కొడుకు ఉన్నడు. పాపం ఆ కప్ప పెనిమిటి.. పోయిన ఆనకాలం చెడగొట్టు ఆనలకు చెట్టు కొమ్మిరిగి మీదవడి జీవమిడిశిండు. గందుకే.. కొడుకును గావురంగ వెంచుకుంటంది తల్లి కప్ప. అతి గావురంతోని చెంగోబిల్ల అనుకుంట.. శెప్తె అస్సలు ఇనకుంట తయారైంది పిల్ల కప్ప. ఎడ్డెమంటే.. తెడ్డం అనవట్టింది. అవ్వ ఏది జెప్తే దానికి పురాంగ తిర్లమర్ల జేసేది. అవుతల్కి పోవద్దంటే అలాయించి పొయ్యి సూపిత్తుండె. కుడి దిక్కు వొమ్మంటే.. ఎడుమ దిక్కు వోతుండె! బువ్వ తినుమంటె.. గడ్డి తింటుండె! పాలు దాగుమంటె.. నీళ్లు దాగుతుండె! రాత్రిపూట పండుకొమ్మంటె.. పగటీలి వంటుండె. ఏది అద్దంటే గదే జేత్తుండె. కొడుకు జేశే కార్నమాలకు అవ్వ కప్ప మాలెస్క బాధలువడ్డది. అయినా పిల్ల కప్పకు తెలివిరాలె.
ఎట్లవడితె గట్లనే జేసేది. ఎంతైనా తల్లి పాయిరమాయే! ఇన్నా ఇనకున్నా.. బుద్ధి మాత్రం జెప్తుండె! పిల్ల కప్ప వట్టిచ్చుకోపోతుండె. తల్లి కప్ప రోజురోజుకు ముసలిది అయితాంది. పిల్ల కప్పను విల్సుకొని.. “బిడ్డా! నా ఆయుసు అయిపేంది. జరనన్న ఇను” అంట మస్తు బతిమిలాడింది. అయినా పిల్ల కప్ప తొవ్వకు రాలె. ఈ కప్పల బలుగానికి ఒక అంతన ఉంది. ఆళ్లదాంట్ల ఎవ్వలు సచ్చినా.. మడుగుకు ఎడుమ దిక్కున్న గుట్ట కింద బొందవెట్టి, గోరి కడుతరు. అట్లయితెనే సర్గం బోతరని ఆళ్ల నమ్మిక. కొడుకుకు ఇవన్నీ జెప్పుతె.. ఆడు తిర్లమర్ల జేస్తడాయె! గందుకే.. మస్తు సోంచాయించి, రేపు జీవమిడుస్త అనంగ కొడుకును విల్సుకొని.. “బిడ్డా నేను రేపో ఎల్లుండో సచ్చిపోత! నా పీనుగను ఎడుమ దిక్కు గుట్టకాడ అస్సలు బొంద వెట్టకు. కుడిదిక్కు వాగు పొంట వెట్టు. ఇది నా ఆఖర్ కాయిష్” అంట చెప్పి పానం ఇడిశింది తల్లి కప్ప.
తల్లి సచ్చిపోంగనే.. ఎంత తిప్పలైతదో పిల్ల కప్పకు మాయిలమే తెలిసింది. బాగా ఏడ్శింది. ‘ఇన్ని దినాల సంది అవ్వ ఏది జెప్పినా జెయ్యలె! గిప్పుడన్న గామె శెప్పినట్టు ఇంట!’ అనుకున్నది పిల్ల కప్ప. పీనుగును అవ్వ జెప్పినట్టు కుడి దిక్కు ఆగు పోంట బొందవెట్టింది. ఆ యాడాది కొట్టిన తొల్సూరు ఆనలకు మట్టి గొట్టుక పొయ్యి పీనుగు అవుతలికి దేలింది. దాన్ని జూశి పిల్ల కప్ప ఏడుసుకుంట కవ్వర కవ్వర వొర్ర వట్టింది. అప్పటికెల్లే.. ఆనలు వడంగనే కప్పలు వొర్రుడు షురవయ్యిందుల్లా.. ఎర్కయిందా!?
…? పత్తిపాక మోహన్
Read Today's Latest Stories News in Telugu and Telugu News
- Tags
- green frog
- korean
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

