నవ గ్రహ ప్రభుత్వం!
జీవితంలో ప్రతి వ్యక్తీ అన్నీ ఉన్నా ఏదో కొరతతో బాధపడుతూంటారు. కొందరు సకల సౌభాగ్యాలున్నా కీర్తి దాహంతో బాధపడుతూంటారు.
జీవితంలో ప్రతి వ్యక్తీ అన్నీ ఉన్నా ఏదో కొరతతో బాధపడుతూంటారు. కొందరు సకల సౌభాగ్యాలున్నా కీర్తి దాహంతో బాధపడుతూంటారు. కొందరు కీర్తి, డబ్బూ అన్నీ సమకూరినా సంసార జీవితంలో మనశ్శాంతి లేక బాధపడుతూంటారు… మొత్తానికి నేను సుఖంగా ఉన్నాను అని తృప్తితో చెప్పేవాళ్ళు అరుదు!
ఈ విషయంగా నలభై ఏళ్ళ క్రితం కీర్తిశేషులు శ్రీ. ఎన్. ఎస్. కృష్ణన్గారు “నల్లతంబి” అనే పిక్చర్ షూటింగ్ విరామంలో ఒక జోక్ చెప్పారు “అమ్మా మీరెవర్నయినా తెలిసినవాళ్ళను ‘ఏమండీ బాగున్నారా!’ అని అడగండి! ‘ఆ! ఏ బాగోలెండి! ఈరోజు ఇంట్లో బాగాలేదు’ అంటారు.
“అలాగా? మీ భార్య బాగున్నారా.”
“ఆ! ఏం భార్యోలెండి! దానికి ఆరోగ్యం బాగాలేదు. ఆర్థరైటీస్తో అవస్థపడుతోంది!”
“మరి పిల్లలు?”
“ఆ ఏం పిల్లలో లెండి! పరీక్షల సమయానికి జ్వరాలూ, జలుబులూ!”
“అయ్యో పాపం? ఇంతకీ మీ బిజినెస్ ఎలా ఉంది?”
“ఆ! ఏం బిజినెసో లెండి! ఒకే నష్టం”…
ఇదీ వరస! ఒక్క ప్రశ్నకయినా సంతోషకరమైన సమాధానం లేదుగదా!” అంటూ చెప్పి అందర్నీ నవ్వించాడా మహానుభావుడు. దీనికంతా కారణం తృప్తి లేకపోవడమే! అదే కొరతలకు కారణం! తృప్తి లేకుండా కొరతలతో బాధపడుతుండడాన్నే పూర్వ ప్రారబ్ధం అనాలి. అందరూ అలా తృప్తితో జీవించే శక్తిగలవారైతే కర్మానుభవం అనే దానికి స్థానమే లేదు పూర్వ కర్మలను అనుభవింపజేసే నవగ్రహాలకు పనేలేదు! కర్మానుభవం అన్నది అతి బలీయమైనది! శివుడంతటి వాడే తప్పించుకోలేకపోయాడంటారు పెద్దలు! ముఖ్యంగా అన్ని గవర్నమెంట్స్నీ మించింది “ప్లానిటరీ గవర్నమెంట్!” కింద ఉండే వాళ్ళని అందలం ఎక్కించగలవు. అందలాన ఉండేవాళ్ళని కిందికి దించిపారేయగలవు గ్రహాలు!
– అత్తగారి కథలు భానుమతీ రామకృష్ణ రచన నుంచి
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

