Yuzvendra Chahal: డేటింగ్ వద్దు.. పెళ్లి చేసుకుంటా.. ధనశ్రీతో చాహల్ ప్రపోజల్
Yuzvendra Chahal: డేటింగ్ ఇష్టం లేదు.. డేటింగ్‌తో సమయం వృధా చేయడం నచ్చదు.. నిన్ను పెళ్లి చేసుకుంటా.. అని క్రికెటర్ చాహల్ డ్యాన్సర్ ధనశ్రీకి ప్రపోజ్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం గురించి వెల్లడించాడు.
న్యూఢిల్లీ: క్రికెటర్ యజువేంద్ర చాహల్( Yuzvendra Chahal).. డ్యాన్సర్ ధనశ్రీ వర్మ(Dhanashree Verma).. పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ జోడీ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్. అయితే ధనశ్రీతో ఏర్పడిన పరిచయం గురించి ఇటీవల చాహల్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తొలి పరిచయంలోనే తనకు డేటింగ్ చేయాలని లేదని, పెళ్లి చేసుకోవాలని ఉందని ధనశ్రీతో చెప్పినట్లు చాహల్ గుర్తు చేశాడు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఇద్దరి మధ్య మొదటిసారి వర్చువల్‌గా పరిచయమైంది.
లాక్డౌన్ వల్ల గురుగ్రామ్‌లో ఉన్న తన ఫ్యామిలీతోనే చాహల్ గడిపారు. లాక్డౌన్ వల్ల చాలా రోజులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందన్నాడు. దాదాపు 4 నెలలు ఇంట్లో గడిపినట్లు చెప్పాడు. ఆ సమయంలో డ్యాన్సింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ వచ్చిందన్నాడు. ధనశ్రీ ఆన్లైన్ క్లాసులు చెబుతుందని ఓ వ్యక్తి సలహా ఇవ్వడంతో.. రెండు నెలల పాటు ఆన్లైన్ డ్యాన్స్ క్లాసులకు చాహల్ అటెండ్ అయ్యాడు.
డ్యాన్సింగ్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో.. నువ్వు ఎలా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నావని ధనశ్రీని అడిగినట్లు చాహల్ చెప్పాడు. చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని అనుభవిస్తానని ఆమె చెప్పిందన్నాడు. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలనుకున్న విషయాన్ని ఆమెకు చెప్పినట్లు తెలిపాడు. డేటింగ్ ఇష్టంలేదన్నాడు. డేటింగ్‌తో సమయాన్ని వృధా చేయలేనన్నాడు. అప్పుడు నా వయసు 30 ఏళ్లు అని, కానీ ధనశ్రీ తనను ముందుగా కలువాలనుకున్నదని, ఆ తర్వాత ఓ సారి ముంబైలో కలుసుకున్నామని, తన ప్రపోజల్‌కు ఆమె ఓకే చెప్పినట్లు చాహల్ తెలిపాడు.
ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో.. డిసెంబర్ 2020లో ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ జట్టుతో చాహల్ ఆడుతున్నాడు. ఐపీఎల్ లో ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

