మందుకు బానిసనై 26 రోజులు పునరావాస కేంద్రంలో ఉన్నా
టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాడు. 36 ఏండ్ల చాహల్ తాను మద్యానికి బానిసైనట్లు ఓ పాడ్‌కాస్ట్‌లో అంగీకరించాడు.
న్యూఢిల్లీ : టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాడు. 36 ఏండ్ల చాహల్ తాను మద్యానికి బానిసైనట్లు ఓ పాడ్‌కాస్ట్‌లో అంగీకరించాడు. మితిమీరిన తాగుడుతో పరిస్థితి చేయి దాటిపోవడంతో పునరావాస కేంద్రంలో 26 రోజులు గడపాల్సి వచ్చిందని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో చాహల్ తెలిపాడు. ‘గతేడాది కౌంటీ క్రికెట్ ముగిసిన తర్వాత పరిస్థితి హద్దులు దాటింది. దాంతో నేను రిహాబ్ సెంటర్‌కు వెళ్లి అక్కడ 26 రోజులు ఉన్నాను. ఆ నిర్ణయం నా వ్యక్తిగత జీవితంలో పెనుమార్పు తెచ్చింది.
ఇప్పుడు నా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతున్నాను’ అని తెలిపాడు. 2011లో ఐపీఎల్ కెరీర్ ప్రారంభమైనప్పుడు అలవాటైన మద్యపాన వ్యసనం భార్య ధనశ్రీతో విడాకుల తర్వాత హద్దులు దాటిందని, దాంతో తన మానసిక పరిస్థితి క్షీణించిందని చాహల్ చెప్పాడు. ‘ఆ సమయంలో నాలో తీవ్రమైన ఆందోళన, పానిక్ అటాక్స్ ప్రారంభమయ్యాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, పానిక్ అటాక్ వచ్చినప్పుడు కనీసం మాట్లాడలేని పరిస్థితి.. పెదాలు బిగుసుకుపోయి ఒకవైపునకు లాగేసేవి. అప్పుడు నాలో ఏదో తేడా ఉందని అందరికీ అర్థమయ్యేది‘ అంటూ ఆ కష్టకాలం గురించి వివరించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

