Yuvraj Singh : భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కెరీర్లో క్యాన్సర్‌ను జయించాడని మనకు తెలిసిందే. 2011 వన్డే ప్రపంచకప్‌లో నెత్తరొడ్డుతూనే భారత్‌ను గెలిపించిన యూవీ.. మృత్యుంజయుడిలా ఈ మహమ్మారి నుంచి బయటపడ్డాడు. మ్యాచ్ విజేతగా టీమిండియాను ఎన్నోసార్లు ఒడ్డున పడేసిన ఈ దిగ్గజ ఆటగాడు ప్రస్తుతం యువ ఆటగాళ్లకు బ్యాటింగ్ మెలకువలు నేర్పుతూ బిజీగా ఉంటున్నాడు. అయితే.. ఒకానొక దశలో అతడు మూడు నుంచి ఆరు నెలలకు మించి బతకడని వైద్యులు తేల్చి చెప్పారట. ఈ విషయాన్ని ‘ది ఓవర్‌ల్యాప్ క్రికెట్’ షోలో పంచుకున్న యువరాజ్ తన క్యాన్సర్ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
స్వదేశంలో జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై క్రీజునంటుకున్న యూవీ నొప్పిని భరిస్తూ నెత్తురు కక్కుతూనే జట్టును గెలిపించాడు. వరల్డ్‌కప్ అనంతరం భారత జట్టు విదేశీ పర్యటనలకు సిద్ధమైన వేళ తనకు క్యాన్సర్ ఉందనే విషయం అతడికి తెలిసింది. టెస్టు జట్టుకు ఎంపికైన సంతోషాన్ని తనకు లేకుండా పోయిందని ది ఓవర్‌ల్యాప్ క్రికెట్ షోలో మైఖేల్ వాన్తో యూవీ చెప్పాడు.
🚨Yuvraj Singh On Hearing He Had Cancer — “I Don’t Care If I Die, I Want That Test Spot”
I was in Delhi when I found out. We were about to go on a tour to West Indies and England. Ganguly had just retired and suddenly my place had opened up to play Test cricket. I was waiting… pic.twitter.com/sAXIdJlxgp
— Rohan💫 (@rohann__45) April 9, 2026
‘కెరీర్ అత్యుత్తమ దశలోనే నేను ఒక్కసారిగా గుంతలో పడిపోయాను. భారత జట్టు వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. టెస్టులకు గంగూలీ వీడ్కోలు పలకడంతో ఏడేళ్ల నా నిరీక్షణ ఫలించే రోజు వచ్చింది. దాంతో, ఆరోగ్యం గురించి ఆలోచించలేదు. చచ్చినా సరే టెస్టు జెర్సీ వేసుకోవాలనుకున్నా కానీ, చూస్తుండగానే నా ఆరోగ్యం మరింతగా క్షీణించింది అని యువరాజ్ వెల్లడించాడు. ఇక డాక్టర్ కలినప్పుడు తాను మరో మూడు – ఆరె నెలలే బతుకుతాననే విషయాన్ని చెప్పార’ని భారత దిగ్గజం ఈ సందర్భంగా తెలిపాడు.

7th Oct 2000, Nairobi ( Kenya)
Yuvraj Singh’s First Time Batting In International Cricket, And That Too Against A Mighty Australia 🔥🔥
Yuvraj Scored Brilliant 84 Runs Off Just 80 Balls👌
India Won The Match By 20 Runs And Yuvraj Got The Man Of The Match Award 🏆 pic.twitter.com/koNz76BKjC
— Khan (@Khanmohammed12) January 29, 2026
‘నా ఆరోగ్యం మరింత దెబ్బతినడంతో డాక్టర్‌ను కలిశాను. నీ ఊపిరితిత్తులకు, గుండెకు మధ్యలో క్యాన్సర్ కణతి ఉంది. ఈ పరిస్థితుల్లో క్రికెట్ ఆడితే నీకు గుండెపోటు రావచ్చు. కీమోథెరపీ చేయించుకోకుంటే నువ్వు మరో మూడు ఆరె
నెలలకు మించి బతకవు అని వైద్యుడు చెప్పాడు. అతడలా చెప్పేసరికి ఆలోచనల్లో పడ్డాను. వెంటనే అమెరికా వెళ్లి లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్(అమెరికా మాజీ రేసింగ్ సైక్లిస్ట్)కు వైద్యం చేసిన డాక్టర్‌ను కలిశా. అప్పుడు ఆయన నన్ను పరీక్షించి నువ్వు ఆస్పత్రి నుంచి సంతోషంగా వెళ్తావు.

నీకు మళ్లీ క్యాన్సర్ అనేది రాదు అని భరోసానిచ్చారు. క్రికెట్ ఆటే నాకు తెలిసిన ప్రపంచం. క్రికెట్ ఆడకుంటే నేనెవరు? అనే ఆలోచనలు నన్ను చుట్టుముట్టేవి. అందుకని కీమోథెరపీ చేయించుకుంటున్న సమయంలో క్రికెట్ వీడియోలు చూసేవాడిని. అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్లు వచ్చి నన్ను చూసి ధైర్యం చెప్పారు. క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాక.. ఇంగ్లండ్‌లో రెండు నెలలు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాను. ఆ తర్వాత తిరిగొచ్చి మైదానంలో అదరగొట్టాను’ అని తాను క్యాన్సర్‌ను జయించి, మళ్లీ క్రికెటర్‌గా రాణించిన తీరును యువరాజ్ వివరించాడు.