న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఇంట సంతోషం వెళ్లివిరిసింది. ఈ హార్డ్ హిట్టర్ తమ జీవితంలోకి మరో యువరాజుకు స్వాగతం పలికాడు. యువరాజ్ సతీమణి హేజల్ కీచ్ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
‘ఆ భగవంతుడు మాకు మగబిడ్డను ప్రసాదించాడనే విషయాన్ని అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవడం సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆశీర్వదించిన దేవునికి కృతజ్ఞతలు. మీరంతా మా ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నాం’ అని యువరాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
బ్రిటిష్-మారిషియస్ నటి, మోడల్ అయిన హేజల్ కీచ్‌ను 2016లో యువరాజ్ సింగ్ పెండ్లి చేసుకున్నాడు. ఇటీవలే వీరు తమ ఐదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.