దుబాయ్: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా యువ పేసర్ నసీమ్ షా మెగాటోర్నీకి దూరమయ్యే చాన్స్ కనిపిస్తున్నది. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో వరల్డ్‌కప్ నాటికి కోలుకునే అవకాశాలు తక్కువేనని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి.