Virat Kohli | శతక సంబుర్లాలో కోహ్లీ.. హఠాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని..!
Virat Kohli : వన్డే క్రికెట్ రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో బ్లాక్ బస్టర్ ఇన్నింగ్స్ ఆడాడు. రాంచీ వన్డేలో దూకుడే మంత్రగా చెలరేగిన విరాట్ శతకంతో అభిమానులకు పూనకాలు తెప్పించాడు. అదే సమయంలో హఠాత్తుగా ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు.
Virat Kohli : వన్డే క్రికెట్ రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో బ్లాక్ బస్టర్ ఇన్నింగ్స్ ఆడాడు. రాంచీ వన్డేలో దూకుడే మంత్రగా చెలరేగిన విరాట్ శతకంతో అభిమానులకు పూనకాలు తెప్పించాడు. జాన్సెన్ ఓవర్లో బౌండరీతో 50 ఓవర్ల ఫార్మాట్లో 52వ సెంచరీ నమోదు చేశాడు కోహ్లీ. తనకెంతో ఇష్టమైన రాంచీలో మూడోసారి వందకు చేరువైన విరాట్ గాల్లోకి ఎగిరి పంచ్ విసిరి సంబురాలు చేసుకున్నాడు. తన మెడలోని తమ పెళ్లి ఉంగురాన్ని ముద్దాడి సెంచరీని తనివితీరా ఆస్వాదించాడు కోహ్లీ. సరిగ్గా అదే సమయంలో హఠాత్తుగా ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు.
కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్‌లో మునిగి ఉండగా.. ఒక అభిమాని భద్రతా వలయాన్ని, కంచెను దాటుకొని పరుగున వచ్చి విరాట్ కాళ్లపై పడ్డాడు. అయితే.. అతడిని అలా చేయొద్దని భారత స్టార్ చెబుతుండగానే.. భద్రతా సిబ్బంది అతడిని లాక్కెళ్లిపోయారు. కోట్లాది మందికి అభిమాన క్రికెటర్ అయిన కోహ్లీని కలిసిసేందుకు అభిమానులు ఇలా మైదానం సిబ్బంది కళ్లుగప్పి పిచ్ వద్దకు రావడం ఇదే మొదటిసారి కాదు. పద్దెనిమిదో సీజన్ ఐపీఎల్‌లోనూ ఇలానే ఒక యువ అభిమాని విరాట్‌ను కలిసి సంబురపడ్డాడు.
A fan breached security to touch #ViratKohli’s feet during the first ODI in #Ranchi .Indian Media #INDvSA pic.twitter.com/BlRsLrm4YV
— Sohail Imran (@sohailimrangeo) November 30, 2025
సచిన్ రికార్డు కనుమరుగు
సొంతగడ్డపై తిరుగులేని రికార్డు కలిగిన విరాట్ కోహ్లీ వన్డేల్లో శతకంతో రెచ్చిపోయాడు. తనకెంతో ఇష్టమైన ఈ ఫార్మాట్లో 52వ శతకంతో తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటాడు విరాట్. స్వదేశంలో ఒకే వేదికపై అత్యధక సెంచరీలు బాదడం ఇది మూడోసారి. ఇదివరకూ పుణే, విశాఖపట్ణంలో మూడేసి శతకాలు బాదిన కోహ్లీ.. ఇప్పుడు రాంచీలో మూడో వంద నమోదు చేశాడు. తకంతో రెచ్చిపోయిన విరాట్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
A leap of joy ❤️💯
A thoroughly entertaining innings from Virat Kohli 🍿
Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5
— BCCI (@BCCI) November 30, 2025
ఇదివరకూ వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సెంచరీలను దాటేసిన కింగ్ కోహ్లీ.. ఈసారి ఒక ఫార్మాట్లో అత్యధిక శతకాలతో సచిన్ రికార్డును బద్ధలుకొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్లో సచిన్ 51 శతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే.. కోహ్లీ వన్డేల్లో 52వ సారి మూడంకెల స్కోర్ అందుకొని అంతర్జాతీయ క్రికెట్ ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీతో చరిత్ర సృష్టించాడు. అంతేకాదు 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ద్వైపాక్షిక వన్డే సిరీస్ (Bilateral ODI Sereis)లో10 వేల పరుగుల క్లబ్లో చేరాడు విరాట్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

