FIFA president | ఆల్కహాల్ లేకున్నా బతకగలరు.. విమర్శకులకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఫిఫా అధ్యక్షుడు
ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్, లైసెన్స్ ఉన్న కేంద్రాల్లో ఆల్కహాల్ అమ్మకాలకు ఓకే
ఖతర్‌లో ఫిఫా వరల్డ్ కప్ రేపు ప్రారంభం కానుంది. అయితే, వరల్డ్ కప్ జరిగే స్టేడియాల్లో ఆల్కహాల్‌పై నిషేధం విధించడం పట్ల అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. చాలామంది ఫిఫా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దాంతో, ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్ఫాంటో దోహాలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించాడు. ‘ఒక రోజులో మూడు గంటలు బీరు తాగకున్నా మీరు బతుకుతారని నేను అనుకుంటున్నాను’ అంటూ విమర్శకులకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. అంతేకాదు ‘ఇప్పుడు ఉన్నవాటిలో ఆల్కహాల్‌పై నిషేధం అనేది పెద్ద సమస్య అయితే నేను బీచ్‌కి వెళ్తాను. డిసెంబర్ 18వ తేదీ వరకు అక్కడే సేదతీరుతాను’ అని ఇన్ఫాంటో అన్నాడు. దాంతో, ఆయన వ్యాఖ్యలపై కొందరు అభిమానులు మండిపడుతున్నారు.
వరల్డ్ కప్‌లో ఆల్కహాల్‌పై నిషేధం విధిస్తూ చివరి నిమషంలో ఫిఫా నిర్ణయం తీసుకుంది. వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరిగే ఎనిమిది స్టేడియాల్లో బీరు అమ్మకాలపై నిషేధం వర్తిస్తుంది. అయితే ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్, లైసెన్స్ ఉన్న కేంద్రాల్లో ఆల్కహాల్ దొరుకుతుంది. ముస్లిం దేశమైన ఖతర్‌లో మామూలుగానే ఆల్కహాల్‌పై నిషేధం ఉంటుంది. అక్కడ కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో మాత్రమే ఆల్కహాల్ దొరుకుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

