Justin Langer: ఐపీఎల్ ట్రోఫీ గెలవకుంటే గొప్ప కోచ్ కాలేవు: లక్నో ఓనర్‌పై కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Justin Langer: ఆసీసీ మాజీ క్రికెటర్, కోచ్ జస్టిన్ లాంగర్.. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ కోచ్‌గా ఎన్ని టోర్నీలు గెలిచినా ఐపీఎల్లో...
Justin Langer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో వచ్చే సీజన్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆసీసీ మాజీ క్రికెటర్, కోచ్ జస్టిన్ లాంగర్.. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ కోచ్‌గా ఎన్ని టోర్నీలు గెలిచినా ఐపీఎల్లో ట్రోఫీ గెలవకుంటే అసలు గొప్ప కోచ్ కాలేరని గొయెంకా తనతో అన్నాడని.. అదే తనకు స్ఫూర్తినిచ్చిందని తెలిపాడు. తాజాగా లక్నో జట్టు విడుదల చేసిన ఓ వీడియోలో లంగర్ ఈ కామెంట్స్ చేశాడు.
వీడియోలో లంగర్ మాట్లాడుతూ… ‘‘అది (గొయెంకాతో మీటింగ్ గురించి) చాలా ఫన్నీగా జరిగింది. నేను పెర్త్‌లో ఉన్నా. లక్నో ప్రతినిధి నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. లక్నో ఓనర్ నన్ను కలవాలని ఆ మెసేజ్ సందేశం. నేను గొయెంకాను కలిశాను. ఆయనలో సేల్స్ మెన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే మా మీటింగ్ అంతా ముగిశాక గొయెంకా నాతో.. ‘చూడు జస్టిన్.. నీకు ఆటగాడిగా అద్భుతమైన కెరీర్ ఉంది. అంతేగాక కోచ్‌గా కూడా నువ్వు మంచి సక్సెస్ పొందావు. కానీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచేదాకా నువ్వు గ్రేట్ కోచ్‌వి కాలేవు..’అని అన్నాడ’’ని తెలిపాడు.
Justin Langer talks Lucknow, IPL, KL Rahul and lots more in his first interview as LSG Head Coach! 💙🙏 pic.twitter.com/boPtgANw8w
— Lucknow Super Giants (@LucknowIPL) December 30, 2023
గొయెంకాతో ఆ మీటింగ్ తర్వాత పలుమార్లు తాము చర్చించుకున్నామని, తమ ఇద్దరి మధ్య ఈ చర్చలు సాగుతున్నాయని గొయెంకా అన్నాడు. లక్నోకు హెడ్‌కోచ్‌గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని, వచ్చే సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని లంగర్ అన్నాడు. అంతేగాక ఐపీఎల్ అంటే ఒలింపిక్స్ వంటిదని, ఈ లీగ్‌లో ప్రతి మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని లంగర్ తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

