శతక జైస్వాల్.. భారత్ తీన్మార్
పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (5/23) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌కు తోడు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 నాటౌట్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో టీమిండియా వరుసగా మూడో విజయంతో అఫ్గానిస్థాన్‌ను వైట్‌వాష్ చేసింది. శనివారం జరిగిన చివరి వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అఫ్గాన్ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని భారత్ 28.4 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది.
- సెంచరీతో మెరిసిన యశస్వి
- ఐదో వికెట్లతో అదరొట్టిన ్రప్రసిద్ధ్
- మూడో వన్డేలో 9 వికెట్లతో గిల్‌సేన గెలుపు
- 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్
చెన్నై: పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (5/23) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌కు తోడు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 నాటౌట్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో టీమిండియా వరుసగా మూడో విజయంతో అఫ్గానిస్థాన్‌ను వైట్‌వాష్ చేసింది. శనివారం జరిగిన చివరి వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అఫ్గాన్ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని భారత్ 28.4 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది.
జైస్వాల్ అద్భుత సెంచరీకి తోడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) అర్ధ శతకంతో మెరిశాడు. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (102) సెంచరీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) అర్ధ శతకంతో రాణించారు. ప్రసిద్ధ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
ప్రసిద్ధ్ నిప్పులు..
తొలి స్పెల్‌లో వరుసగా ఐదు ఓవర్లు చేసిన పేసర్ ప్రసిద్ధ్.. బుల్లెట్లలాంటి బంతులతో టాపార్డర్‌ను కకావికలం చేశాడు. తన తొలి బంతికే స్లిప్‌లో రోహిత్ పట్టిన క్యాచ్‌తో ఇన్ఫామ్ ఓపెనర్ ్ల గుర్బాజ్ (5)ను ఔట్ చేశాడు. ప్రసిధ్ బౌలింగ్‌లోనే రహ్మత్ షా (5), ఇబ్రహీం జద్రాన్ (11)కూడా రోహిత్‌కు చిక్కారు. పదో ఓవర్లో రసూలీ (1)ని కూడా ప్రసిద్ధ్ ఔట్ చేయడంతో 36/4 తో నిలిచిన అఫ్గాన్ 100 పరుగులు కూడా చేయడం కష్టమే అనిపించింది. ఈ దశలో అద్భుతంగా పోరాడిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది జట్టును అదుకున్నాడు. ఒమర్జాయ్ సహకారంతో ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించిన అతను సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టు స్కోరు 200 దాటించాడు.
దంచికొట్టిన ఓపెనర్లు
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు అఫ్గాన్ బౌలర్లను దంచికొట్ట్టారు. జైస్వాల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. అజ్మతుల్లా వేసిన మొదటి ఓవర్లోనే 3 ఫోర్లు బాదాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా జట్టులో స్థానం ఆశిస్తున్న జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లను మెప్పించాడు. తనదైన శైలిలో అలవోకగా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మరోఎండ్‌లో రోహిత్ కూడా క్లాసిక్ షాట్లతో బౌండరీలు రాబట్టాడు.
ఈ క్రమంలో జైస్వాల్ 38 బంతుల్లో, రోహిత్ 47 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. స్పిన్నర్ రషీద్ బౌలింగ్‌లో సిక్సర్లతో అలరించిన రోహిత్ మరో సిన్నర్ నబీ వేసిన బంతిని పుల్ చేయబోయి క్యాచ్ ఔటవడంతో 170 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా, జైస్వాల్ ఏమాత్రం తగ్గకుండా కేవలం 83 బంతుల్లోనే తన రెండో వన్డే సెంచరీ పూర్తి చేశాడు. అయ్యర్ (20 నాటౌట్) తోడుగా ముందుకెళ్లిన అతను నబీ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు:
అఫ్గానిస్థాన్: 44.2 ఓవర్లలో 218 ఆలౌట్ (షాహిది 102, అజ్మతుల్లా 50, ప్రసిద్ధ్ 5/23); భారత్: 28.4 ఓవర్లలో 224/1 (జైస్వాల్ 110 నాటౌట్, రోహిత్ 79, నబీ 1/47)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

