Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ ఔట్‌పై వివాదం.. సునిల్ గవాస్కర్ ఫుల్ సీరియస్.. వీడియో
Yashasvi Jaiswal: మెల్బోర్న్ టెస్టులో జైస్వాల్ అవుటైన తీరు వివాదం అవుతున్నది. థార్డ్ అంపైర్ సైకత్ ఇచ్చిన నిర్ణయాన్ని క్రికెట్ లవర్స్ తప్పుపడుతున్నారు. స్నికో రిప్లేలో బ్యాట్‌కు బంతి తగిలినట్లు తేలకున్నా.. ఎలా ఔట్‌గా ప్రకటించారని నిలదీస్తున్నారు.
మెల్బోర్న్: మెల్బోర్న్ టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 184 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఇండియన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) ఔటైన తీరు వివాదాస్పదమైంది. రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన ఆట ఆడుతున్న సమయంలో.. జైస్వాల్‌ను థార్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఆ విలువైన వికెట్ కోల్పోవడంతో.. భారత్ ఆ మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది.
84 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్ చేస్తున్న జైస్వాల్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో హుక్ షాట్ కొట్టాడు. నిజానికి ఆన్‌ఫీల్డ్ అంపైర్ దాన్ని ఔట్ ఇవ్వలేదు. కానీ థార్డ్ అంపైర్ సైకత్ షర్ఫుద్దౌలా అవుట్‌గా ప్రకటించాడు. బ్యాట్‌కు బంతి తగిలినట్లు స్నికోలో తేలలేదు. కానీ బంతి ప్రయాణిస్తున్న లైన్ స్వల్పంగా మారినట్లు గుర్తించిన థార్డ్ అంపైర్ అతన్ని అవుట్‌గా ప్రకటించాడు.
లెగ్ సైడ్‌లో కమ్మిన్స్ షార్ట్‌పిచ్ బంతి వేశాడు. దాన్ని హుక్ చేయబోగా, అది మిస్సైంది. కీపర్ అలెక్సీ ఆ బంతిని అందుకున్నాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ జోయల్ విల్సన్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించారు. బౌలర్ రివ్యూకు వెళ్లడంతో .. థార్డ్ అంపైర్ జోయల్ విల్సన్ ఔట్ ఇచ్చేశాడు. 208 బంతులు ఆడిన జైస్వాల్ 84 రన్స్ వద్ద ఔటయ్యాడు.
భారత్‌ను డ్రా దిశగా తీసుకెళ్తాడని భావిస్తున్న తరుణంలో ఓపెనర్ జైస్వాల్ అవుట్ కావడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లతో జైస్వాల్ మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. అయితే థార్డ్ అంపైర్ నిర్ణయం సబబే అని ఛానల్ 7లో ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్ సైమన్ టఫెల్ పేర్కొన్నారు.
మరో వైపు మాజీ క్రికెటర్ గవాస్కర్.. థార్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. బంతి బ్యాట్‌కు తాకలేదన్నారు. బంతి వెళ్లిన మార్గాన్ని కేవవం ఆప్టికల్ ఇల్యూజన్‌గా ఆయన అభివర్ణించారు. స్నికో టెక్నాలజీ ద్వారా గుర్తించలేని విషయాన్ని ఎలా ఔట్‌గా పరిగణిస్తారని ప్రశ్నించారు. టెక్నాలజీతో ఔట్ నిర్ణయాన్ని తేల్చలేనప్పుడు, అసలు ఆ టెక్నాలజీ వద్దన్నారు.
🗣 “Yeh optical illusion hai.”#SunilGavaskar questions the 3rd umpire’s decision to overlook the Snicko technology. OUT or NOT OUT – what’s your take on #Jaiswal’s dismissal? 👀#AUSvINDOnStar 👉 5th Test, Day 1 | FRI, 3rd JAN, 4:30 AM | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/vnAEZN9SPw
— Star Sports (@StarSportsIndia) December 30, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

