Common Wealth Games | బర్మింగ్హమ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో సాక్షిమాలిక్ 62 కిలోల ఫ్రీస్టైల్ క్యాటగిరి రెస్లింగ్‌లో స్వర్ణ పతకం కొట్టాడు. కెనడాకు చెందిన అనా గొంజాలెజ్‌పై విజయం సాధించారు. ఒకానొక దశలో ప్రత్యర్థి అనా గొంజాలెజ్‌పై 0-4 తేడాతో వెనుకబడ్డ సాక్షి మాలిక్ తిరిగి పుంజుకుని పై చేయి సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో సాక్షి మాలిక్‌కు ఇది తొలి స్వర్ణ పతకం. కామన్వెల్త్ గేమ్స్‌లో మూడో పతకం. తిరిగి చాంపియన్ కావడం చాలా మంచిగా అనిపించిందన్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
టేబుల్ టెన్నిస్ మెన్స్ డబుల్స్ విభాగంలో శరత్ కమల్, జీ సాథియాన్ జోడీ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టామ్ జార్విస్, ఆమ్ వాకర్లను 3-0 స్కోర్ తేడాతో మట్టి కరిపించారు. మిక్స్డ్ డబుల్స్‌లో సెమీస్‌లోకి వెళ్లలేకపోయిన శరత్, సాతియాన్ జోడీ మ్యాజిక్ చేసి ప్రత్యర్థులపై విజయం సాధించారు.