WPL 2024, UP vs DC | రెండో మ్యాచ్‌లో అయినా బోణీ కొడతరా..? యూపీతో పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ
WPL 2024, UP vs DC | గత సీజన్ రన్నరప్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడగా, మరోవైపు యూపీ వారియర్స్ సైతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఆఖర్లో తడబడి సీజన్‌ను ఓటమితో ఆరంభించింది. ఈ రెండు జట్లూ నేడు...
WPL 2024, UP vs DC | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో తొలి మ్యాచ్‌ను పరాజయంతో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్‌లు ఈ సీజన్లో తొలి విజయం నమోదుచేయడం కోసం బరిలోకి దిగాయి. గత సీజన్ రన్నరప్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడగా, మరోవైపు యూపీ వారియర్స్ సైతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఆఖర్లో తడబడి సీజన్‌ను ఓటమితో ఆరంభించింది. ఈ రెండు జట్లూ నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. యూపీ వారియర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. యూపీ సారథి అలిస్సా హీలి, ఢిల్లీ సారథి మెగ్ లానింగ్ ఇద్దరూ ఆస్ట్రేలియాకే చెందినవారు కావడం గమనార్హం.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి బాల్‌కు ఐదు పరుగులు చేయాల్సి ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ అలీస్ క్యాప్సీ వేసిన బంతిని సజన సాజీవన్ సిక్సర్ కొట్టడంతో విజయం సాధించింది. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని (158) ఛేదించే క్రమంలో 17 ఓవర్ల దాకా తమ వైపు (127-4)నకే ఉన్న మ్యాచ్‌లో యూపీ బ్యాటర్లు తడబడ్డారు. మూడు ఓవర్లలో ఆ జట్టు ఆలౌట్ అయి ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో మాత్రం అలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూసుకోవాలని ఢిల్లీ, యూపీ భావిస్తున్నాయి.
తుది జట్లు :
ఢిల్లీ క్యాపిటల్స్ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలీస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్నె కాప్, అన్నాబెల్ సదర్లండ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, తానియా భాటియా, రాధా యాదవ్, శిఖా పాండే
యూపీ వారియర్స్ : అలీస్సా హీలి (కెప్టెన్), వృందా దినేశ్, తహిలా మెక్‌గ్రాత్, గ్రేస్ హరీస్, శ్వేతా సెహ్రవత్, కిరణ్ నవ్గిరె, పూణమ్ ఖేమ్నర్, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్,రాజేశ్వరి గైక్వాడ్, గౌతీ సుల్తానా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

