WPL 2024, DC vs MI | పది రోజుల క్రితం బెంగళూరు వేదికగా మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆ నగరానికి బాయ్ బాయ్ చెప్పంది. నేటి నుంచి డబ్ల్యూపీఎల్.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి షిఫ్ట్ అయ్యింది. బెంగళూరులో మాదిరిగానే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్లు తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో (ఢిల్లీ ఫస్ట్, ముంబై సెకండ్) ఉన్న ఈ జట్లకు నేటి గెలుపు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చేయనుండగా ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది.
రెండో సీజన్లో ఢిల్లీ, ముంబైలు తలా నాలుగు మ్యాచ్లు ఆడినా మూడు గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోయింది. అయితే నెట్ రన్ రేట్ పరంగా చూస్తే ఢిల్లీ (+1.251).. ముంబై (+0.402) కంటే మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ముంబై అగ్రస్థానానికి చేరనుంది. ఢిల్లీ గెలిస్తే అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ కూడా ఢిల్లీ – ముంబై మధ్యే జరిగింది. ఈ పోరులో ముంబై.. 4 వికెట్ల తేడాతో నెగ్గింది.