Cricketers – Legendary Players | ఒకప్పుడు వీళ్లంతా క్రికెటర్లు.. అనూహ్యంగా మరొక ఆటలో రికార్డులు కొల్లగొట్టారు
Cricketers - Legendary Players : ప్రపంచంలో ఎన్నో క్రీడలు ఉన్నప్పటికీ క్రికెట్‌ది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), షేన్‌వార్న్ (Shane Warne), సనత్ జయసూర్య(Sanath Jayasuriya), షాన్ పొలాక్(Shaun Pollock), ఏబీ డివిలియర్స్(AB de Villiers), విరాట్ కోహ్లీ(Virat Kohli), ఎంఎస్ ధోనీ(MS Dhoni) సహా ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లను ప్రపంచానికి....
Cricketers – Legendary Players : ప్రపంచంలో ఎన్నో క్రీడలు ఉన్నప్పటికీ క్రికెట్‌ది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), షేన్‌వార్న్ (Shane Warne), సనత్ జయసూర్య(Sanath Jayasuriya), షాన్ పొలాక్(Shaun Pollock), ఏబీ డివిలియర్స్(AB de Villiers), విరాట్ కోహ్లీ(Virat Kohli), ఎంఎస్ ధోనీ(MS Dhoni) సహా ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లను ప్రపంచానికి అందించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) అడుగుపెట్టాక ఈ క్రీడకు మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రపంచంలోని అత్యధిక మంది వీక్షించే ఆటగా రికార్డులకెక్కింది. ఇతర క్రీడల్లో దిగ్గజాలుగా ఎదిగినవారు సైతం క్రికెట్‌పై మనసు పారేసుకున్న సందర్భాలు అనేకం. స్విస్ మాజీ టెన్నిస్ ప్లేయర రోజర్ ఫెదరర్(Roger Federer) ఒకసారి క్రికెట్ అంతే తనకెంత ఇష్టమో బయటపెట్టాడు. ఖాళీ సమయాల్లో తాను క్రికెట్ ఆడుతుంటానని చెప్పుకొచ్చాడు. అతడే కాదు.. మరెంతోమంది దిగ్గజ క్రీడాకారులు క్రికెట్‌పై మనసు పారేసుకున్నారు. వాళ్లు ఎవరు? ఆ తర్వాత ఏ ఆటలో వాళ్లు పాపులర్ అయ్యారు అనేది చదివేయండి.
ఉసేన్ బోల్ట్(Usain Bolt).. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. చిరుతను మరిపించే వేగం ఈ జమైకన్ స్ప్రింటర్ సొంతం. 100, 200 మీటర్ల పరుగులో వరుసగా మూడుసార్లు (2008, 2012, 2016) ఒలింపిక్ పతకాలు సాధించిన ఒకే ఒక్కడు. అంతేకాదు 11సార్లు ప్రపంచ చాంపియన్. రేస్ ట్రాక్స్‌పై అతడి పరుగు మెరుపును తలపిస్తుంది. అందుకే అతడిని ‘లైట్నింగ్ బోల్ట్’ అని ముద్దుగా పిలుస్తుంటారు. 2017లో అథ్లెటిక్స్ నుంచి బోల్ట్ రిటైరయ్యాడు. అతడికి డ్యాన్సింగ్, మ్యూజిక్, క్రికెట్ అన్నా ఇష్టమే.
స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్

2019లో ఒకసారి మాట్లాడుతూ.. క్రికెట్ అంతే తనకు చెప్పలేనంత ఇష్టమని బోల్ట్ వెల్లడించాడు. తాను సచిన్ టెండూల్కర్ అభిమానినని, వకార్ యూనిస్ పేస్ బౌలింగ్ తనను కట్టిపడేసేదని చెప్పుకొచ్చాడు. ఇక, జమైకాకే చెందిన దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. తామిద్దరం కలిసి ఓ చారిటీ కోసం కూడా ఆడామని చెప్పాడు. కింగ్‌స్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉసేన్ బోల్ట్ గేల్‌ను అవుట్ చేయడమే కాదు, అతడి బౌలింగులో ఓ బౌండరీ కూడా బాదాడు.
హ్యారీ కేన్
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆటగాళ్లలో ఫుట్‌బాలర్ హ్యారీ కేన్(Harry Kane) ఒకడు. 2018 నుంచి హ్యారీ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ తరపున అత్యధిక గోల్స్(58) సాధించిన ఆటగాడి రికార్డు అతడి పేరునే ఉంది. ప్రసిద్ధ ఇంగ్లిష్ ఫుట్‌బాల్ క్లబ్ టోటెన్హామ్ హాట్స్పుర్ తరపున ఏకంగా 208 గోల్స్ చేశాడు.
ఫుట్‌బాలర్ హ్యారీ కేన్

ప్రీమియర్ లీగ్‌లో జరిగే టోటెన్హామ్ గేమ్‌ను వీక్షించాల్సిందిగా 2019 ఆగస్టులో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను కేన్ ఆహ్వానించాడు. ఆగస్టు 2022లో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ స్టేడియంలో కేన్ సందడి చేశాడు. హండ్రడ్ కాంపిటిషన్లో భాగంగా లండన్ స్పిరిట్-మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించాడు. 2019 ప్రపంచ కప్ సమయంలో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్, స్కిప్పర్ ఇయాన్ మోర్గాన్‌తో కలిసి కనిపించాడు. అంతేకాదు భారత దిగ్గజం రవి శాస్త్రితో కలిసి కామెంటరీ కూడా చెప్పి క్రికెట్‌పై తన మక్కువను చాటుకున్నాడు.
ఇయాన్ థోర్ప్
ఆస్ట్రేలియా రిటైర్డ్ స్విమ్మర్ ఇయాన్ థోర్ప్(Ian Thorpe) ఈతలో తన అసమాన ప్రతిభా పాటవాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. 2000 సమ్మర్ ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు అందుకున్నాడు. జనవరి 2019లో థోర్ప్ మాట్లాడుతూ.. తనను క్రికెటర్‌గా చూడాలని తన తల్లిదండ్రులు అనుకునేవారని చెప్పాడు. స్కూలు రోజుల్లో తాను క్రికెట్ ఆడేవాడినని గుర్తు చేసుకున్నాడు.
స్విమ్మర్ ఇయాన్ థోర్ప్

అయితే, ఆ తర్వాత తాను స్విమ్మింగ్ వైపు వెళ్లినట్టు తెలిపాడు. తాను క్రికెట్‌ను కాదని స్విమ్మింగ్‌ను ఎంచుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించగలిగినట్టు పేర్కొన్నాడు. థోర్ప్ తండ్రి కెన్ థోర్ప్ టీనేజ్‌లో ఉండగా బ్యాంక్స్టౌన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సిడ్నీ జిల్లా జట్టుకు బ్యాటర్‌గా సేవలందించాడు. అంతేకాదు, సీజన్ బ్యాటింగ్ సగటులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్‌ను కూడా వెనక్కి నెట్టేశాడు.
యొహాన్ బ్లేక్
పరుగు పందేలను ఫాలో అయ్యే వారికి యొహాన్ బ్లేక్(Yohan Blake) చిరపరిచితమే. అతడు కూడా జమైకన్ స్ప్రింటరే. తన కెరియర్లో ఎన్నో విజయాలు అందుకున్న బ్లేక్, ఉసేన్ బోల్ట్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత అతడు రిటైరయ్యే అవకాశం ఉంది.
యొహాన్ బ్లేక్

బ్లేక్‌కు కూడా క్రికెట్ అంతే ఎనలేని అభిమానం. తరచూ క్రికెట్ ఆడతుంటాడు కూడా. 33 ఏళ్ల బ్లేక్ కింగ్స్టన్ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు. 2020 ఐపీఎల్లోను బ్లేక్ బాగా ఫాలో అయ్యాడు. ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించినప్పుడు గేమ్‌లో అద్భుతమైన థ్రిల్ ఉందంటూ ఓ వీడియో పోస్టు చేశాడు.
జెమీ డ్వేర్
ఆస్ట్రేలియా ఫీల్డ్ హాకీ ప్లేయర్ జెమీ డ్వేర్(Jamie Dwyer) 2001-2016 మధ్య దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. తన సుదీర్ఘ కెరియర్లో 350కిపైగా మ్యాచ్‌లు ఆడి 220 గోల్స్ సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్ తర్వాత హాకీకి బైబై చెప్పేశాడు. ప్రస్తుతం పెర్త్‌లో మెల్విల్లే టొయోటో లీగ్‌లో వైఎంసీసీ కోస్టల్ సిటీ హాకీ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
హాకీ ప్లేయర్ జెమీ డ్వేర్

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మ్యాక్గిల్ అతడికి మేనేజర్‌గా పనిచేశాడు. బాల్యంలో జెమీ డ్వేర్ చాలాకాలం పాటు క్రికెట్ ఆడాడు. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను 15 ఏళ్ల వయసులో క్రికెట్ స్కాలర్షిప్ కూడా అందుకున్నాడు. అయితే, ఆ తర్వాత హాకీని ఎంచుకొనిఒలింపిక్లో ఆడాలన్న కలను నెరవేర్చుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

