KL Rahul | ‘ధోనీ రివ్యూ సిస్టమ్’ కాదు.. ‘డిసిషన్ రాహుల్ సిస్టమ్’
MS Dhoni | అంతర్జాతీయ క్రికెట్లో లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించడంతో పాటు.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిన మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni).. బ్యాట్‌తో భారీ షాట్లు ఆడటంతో పాటు.. కీపర్‌గానూ తనదైన ముద్ర వేశాడు. ఒకప్పుడు వికెట్ల వెనుక నుంచి ధోనీ అప్పీల్ చేశాడంటే చాలు అంపైర్ తన నిర్ణయంపై సందేహ పడిపోయేవాడు.
KL Rahul | అంతర్జాతీయ క్రికెట్లో లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించడంతో పాటు.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిన మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni).. బ్యాట్‌తో భారీ షాట్లు ఆడటంతో పాటు.. కీపర్‌గానూ తనదైన ముద్ర వేశాడు. ఒకప్పుడు వికెట్ల వెనుక నుంచి ధోనీ అప్పీల్ చేశాడంటే చాలు అంపైర్ తన నిర్ణయంపై సందేహ పడిపోయేవాడు. రివ్యూ తీసుకోవడంలో ధోనీ కచ్చితత్వం అతడిని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. అంతర్జాతీయ క్రికెటలో డిసిషన్ రివ్యూ సిస్టం (డీఆర్ఎస్) ప్రవేశ పెట్టిన తర్వాత.. దాన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్న మహీ.. ఎన్నోసార్లు అంపైర్ల నిర్ణయాలు తప్పని తన అప్పీల్‌తో నిరూపించాడు. దీంతో డిసిషన్ రివ్యూ సిస్టం (DRS) కాస్తా ‘ధోనీ రివ్యూ సిస్టం’గా మారిపోయింది. అయితే అంతటి అనుభజ్ఞుడు ఈసారి వన్డే వరల్డ్‌కప్‌లో అందుబాటులో లేకపోయేసరికి టీమ్ఇండియా తడబడుతుందేమో అనుకుంటే.. కేఎల్ రాహుల్ (KL Rahul) భళా అనిపించుకుంటున్నాడు.
చిరుత లాంటి కండ్లతో వికెట్ల మీద దృష్టి పెట్టే రాహుల్.. బంతి గమనం, వేగం, ఎత్తు విషయంలో కెప్టెన్‌కు సరైన సలహాలు ఇస్తూ.. జూనియర్ మహీ అనిపించుకుంటున్నాడు. ఈ ప్రపంచకప్‌లో అది ఎన్నోసార్లు నిరూపితమైంది. ముఖ్యంగా బౌలర్లు బాగా జోష్‌లో ఉండే సమయంలో వారి మాటలు పట్టించుకోకుండా.. రాహుల్ అంగీకరిస్తేనే రోహిత్ రివ్యూకు వెళ్తున్నాడు. మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టుకు వెన్నెముకగా నిలవడంతో పాటు.. కెప్టెన్ సందేహంలో ఉన్న ప్రతిసారి రివ్యూ విషయంలో రాహుల్ సాయపడుతున్నాడు. అతడి నిర్ణయాలు చాలా వరకు సరైనవే అని తేలడంతో హిట్‌మ్యాన్ కూడా.. పూర్తిగా రాహుల్‌పైనే భారం వేస్తున్నాడు. జడేజా, కుల్దీప్ వంటి స్పిన్నర్ల బంతులను అంచనా వేయడం బ్యాటర్లకే కష్టమైతున్న సమయంలో.. వికెట్ల వెనుక నుంచి రాహుల్ వాటిని చక్కగా చదువుతుండటం విశేషం. దీంతో గతంలో ధోనీ రివ్యూ సిస్టమ్‌గా పిలుచుకునే డీఆర్ఎస్ను ఇప్పుడు అభిమానులు ముద్దుగా ‘డిసిషన్ రాహుల్ సిస్టమ్’గా నామకరణం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

