హైదరాబాద్: మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్‌ను దేశీ లుక్‌లో చూశారా ? ఆ మేటి క్రికెటర్ ఓ అందాల ముద్దుగుమ్మ కూడా. మైదానంలో అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకునే హర్లీన్.. ఈసారి సాంప్రదాయ దుస్తుల్లో అందర్నీ స్టన్ చేస్తోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్‌తో ఆమీ జోన్స్‌ను ఔట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆమె క్రికెట్ ప్రతిభను మెచ్చుకుంటూ సచిన్, లక్ష్మణ్, నసీర్ హుస్సేన్‌లు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆ దేశీ క్యూటీ క్రికెట్ జెర్సీని వదిలేసి లెహంగా లుక్‌లో జిగేల్‌మంటోంది. తన సోదరుడి పెళ్లిలో హర్లీన్ డియోల్ ఇలా మిళమిళా మెరిసిపోయింది. పెళ్లికూతురు తరహాలో వెలిగిపోతున్నావంటూ తోటి క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఓ కామెంట్ చేసింది.