KKR vs PBKS : తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత గడ్డపై బిగ్ ఫైట్‌కు సిద్ధమైంది. వరసగా రెండు విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో నిలువరించాలనే కసితో ఉంది కేకేఆర్. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కోల్‌కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ వేదికపై ఏమంత గొప్ప రికార్డు లేని పంజాబ్‌ను అజింక్యా రహానే సేన ఓడిస్తుందా? లేదా అయ్యర్ టీమ్ హ్యాట్రిక్ కొడుతుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
రికార్డులు తిరగేస్తే పంజాబ్ కింగ్స్‌పై ఆధిపత్యం కోల్‌కతాదే. ఇరుజట్లు 34 సార్లు తలపడగా కేకేఆర్ 21 విజయాలు సాధించింది. పంజాబ్ 13 దఫాలు గెలిచింది. వీటిలో ఈడెన్ గార్డెన్స్‌లో 14 మ్యాచుల్లో 9 విజయాలతో పంజాబ్‌ను వణికించింది. అయితే.. నిరుడు చాహల్ విజృంభణతో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. దాంతో, ఈసారి గెలిచేది ఎవరు అనేది ఆసక్తి రేపుతోంది.
కోల్‌కతా తుది జట్టు : ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), రొవ్మన్ పావెల్, రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి.
ఇంప్యాక్ట్ సబ్స్ : బ్లెస్సింగ్ ముజరబని, మనీశ్ పాండే, తేజస్వీ సింగ్, రాహుల్ త్రిపాఠి, సౌరభ్ దూబే.
We’re at the iconic Eden Gardens under the night sky! 🤩
Building up towards @KKRiders 🆚 @PunjabKingsIPL 👌
Updates ▶️ https://t.co/euWd7rFlqm#TATAIPL | #KhelBindaas | #KKRvPBKS pic.twitter.com/Iw59CUf9wJ
— IndianPremierLeague (@IPL) April 6, 2026
పంజాబ్ తుది జట్టు : ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), కూపర్ కొన్నొల్లీ, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, గ్జావియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ : ప్రియాన్ష్ ఆర్య, సూర్యాన్ష్ షెడ్గే, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హర్‌ప్రీత్ బ్రార్.