వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?

లండన్: 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా ఆష్లీ బార్టీ నిలిచింది. అయితే ఈ వరల్డ్ నంబర్ టెన్నిస్ ప్లేయర్.. ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయం చాలా మందికి తెలియదు. గతంలో ఆస్ట్రేలియా వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లోనూ బార్టీ ఆడటం విశేషం. శనివారం జరిగిన ఫైనల్లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ప్లిస్కోవాపై 6-3, 6-7, 6-3తో గెలిచి కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఎగరేసుకుపోయింది బార్టీ. 2019లో ఆమె ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది.
మల్టీ స్పోర్ట్స్ స్టార్
టెన్నిస్‌లో ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్‌గా ఎదిగినా.. 2014లో ఆమె కాసేపు ఈ ఆటకు బ్రేక్ ఇచ్చి క్రికెట్ వైపు వెళ్లింది. వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ టీమ్ తరఫున కూడా కొన్ని మ్యాచ్‌లు ఆడింది. తన జీవితంలో ఆ కాస్త క్రికెట్ కెరీర్ మరుపురానిదని బార్టీ చెబుతోంది. క్రికెట్ టీమ్‌లో తనకు చాలా మంచి సహచరులు దొరికారని, వాళ్లందరితో ఇప్పటికీ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పింది.
వింబుల్డన్ గెలిచిన తర్వాత వాళ్ల నుంచి తనకు ఎన్నో సందేశాలు వచ్చినట్లు తెలిపింది. 2012 తర్వాత తొలిసారి మూడు సెట్ల పాటు జరిగిన వింబుల్డన్ ఫైనల్లో బార్టీ విజయం సాధించింది. తొలి సెట్లోనే 4-0 ఆధిక్యంలో దూసుకెళ్లిన బార్టీ.. చాలా సులువుగా ఫైనల్ గెలుస్తుందని అందరూ భావించారు. అయితే ప్లిస్కోవా నుంచి సెకండ్ సెట్లో అనూహ్యంగా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆ సెట్ బార్టీ కోల్పోవడంతో మూడో సెట్ తప్పలేదు. ఆ సెట్లో మొదటి నుంచీ ఆధిపత్యం ప్రదర్శించిన బార్టీ.. మొత్తానికి టైటిల్ గెలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

