World Cup Qualifiers 2023 | ఆఖరి బెర్త్ ఎవరిదో..? ఆసక్తికరంగా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ పోటీ
World Cup Qualifiers 2023 : ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ పోటీ మరింత అసక్తికరంగా మారింది. మాజీ చాంపియన్ శ్రీలంక(Srilanka) జట్టు ఈరోజు అర్హత సాధించింది. దాంతో, మిగిలిన ఆఖరి బెర్తు కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం రేసులో స్కాట్లాండ్(Scotland), జింబాబ్వే(Zimbabwe), నెదర్లాండ్స్(Netherlands) జట్లు...
World Cup Qualifiers 2023 : ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ పోటీ మరింత అసక్తికరంగా మారింది. మాజీ చాంపియన్ శ్రీలంక(Srilanka) జట్టు ఈరోజు అర్హత సాధించింది. దాంతో, మిగిలిన ఆఖరి బెర్తు కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం రేసులో స్కాట్లాండ్(Scotland), జింబాబ్వే(Zimbabwe), నెదర్లాండ్స్(Netherlands) జట్లు మాత్రమే పోటీలో నిలిచాయి. అయితే.. శ్రీలంకపై ఓటమి పాలైన జింబాబ్వే వరల్డ్ కప్ ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి.
మంగళవారం స్కాట్లాండ్తో మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టు కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు జింబాబ్వే 8, స్కాట్లాండ్ 6 పాయింట్లతో గ్రూప్ ఏ లో వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు.. రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. 6 పాయింట్లతో ఉ్నన స్కాట్లాండ్ కూడా టోర్నమెంట్ నుంచి వైదొలిగినట్టే.
నిస్సంక సెంచరీ
వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్(World Cup Qualifiers 2023)లో భాగంగా ఈరోజు జరిగిన సూపర్ సిక్స్(Super Six) మ్యాచ్‌లో జింబాబ్వే(Zimbabwe)పై భారీ విజయం సాధించింది. మహీశ్ థీక్షణ(Maheesh Theekshana) 4 వికెట్ల ప్రదర్శనకు తోడూ ఓపెనర్ ప్రథుమ్ నిస్సంకా(101 నాటౌట్) సెంచరీ బాదడంతో 9 వికెట్ల తేడాతో గెలిచింది. 8 పాయింట్లతో వరల్డ్ కప్‌కి క్వాలిఫై అయింది.
ప్రథుమ్ నిస్సంక

జింబాబ్వే నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని లంక ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ ప్రథుమ్ నిస్సంక(101 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో అతడికి ఇది 10వ సెంచరీ. కుశాల్ మెండిస్(25)తో కలిసి నిస్సంక జట్టును గెలిపించాడు. 33.1 ఓవర్లలోనే లంక టార్గెట్‌ను చేరుకుంది. 2011 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన లంక ఈసారి టైటిల్ వేటకు సిద్ధమవుతోంది. ఈఏడాది వన్డే వరల్డ్ కప్ భారత గడ్డపై జరగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

