Hrishikesh Kanitkar : న్యూజిలాండ్ సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు అతడిని మిస్టర్ 360 అని పొగుడుతున్నారు. తాజాగా అండర్-19 టీమ్ హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్ టీ 20ల్లో వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న సూర్యను ఆకాశానికి ఎత్తేశాడు. ‘జట్టులో సూర్యకుమార్లాగా విధ్వంసకరంగా ఆడగల ఆటగాళ్లు పది మంది ఉండాలని అభిప్రాయపడ్డాడు. అయితే, ప్రతి ఒక్కరూ సూర్యలా ఆడడం సాధ్యం కాకపోవచ్చు. అతను ప్రత్యేకమైన ఆటగాడు. ప్రపంచంలోని చాలామంది యువ ఆటగాళ్లకు సూర్యకుమార్ స్ఫూర్తిగా నిలుస్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్ సాధన చేయడం సూర్యకు బాగా కలిసొచ్చింది’ అని హృషికేశ్ తెలిపాడు.
ఆస్ట్రేలియాలో జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో సూర్యకుమార్ వరుస అర్థ సెంచరీలతో చెలరేగాడు. విరాట్ కోహ్లీతో కలిసి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే ఫామ్‌ను న్యూజిలాండ్ సిరీస్‌లోనూ కంటిన్యూ చేస్తూ రెండో టీ 20లో 41 బంతుల్లో సెంచరీ బాదేశాడు. వర్షం కారణంగా రద్దయిన రెండో వన్డేలోనూ సూర్య 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.