Glen Maxwell | అతడిని బిగ్‌బాష్ లీగ్‌లో ఆడించాలంటే మా జట్టు మొత్తాన్ని తొలగించాలి : గ్లెన్ మ్యాక్స్‌వెల్
సూర్యకుమార్‌ని కొనేందుకు మా దగ్గర సరిపోను డబ్బు లేదు
Glen Maxwell : బిగ్‌బాష్ లీగ్‌లో టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ ఆడడంపై ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ను బిగ్‌బాష్ లీగ్‌లో తీసుకునే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘సూర్యకుమార్‌ను బిగ్‌బాష్ లీగ్‌లో తీసుకునే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అతను చాలా ట్యాలెంటెడ్ ప్లేయర్. అతడిని వేలంలో దక్కించుకోవాలంటే జట్టులో ఉన్న అందరినీ తొలగించాలి. వాళ్లందరికి ఇవ్వాల్సిన డబ్బుతో సూర్యకుమార్‌ను కొనాల్సి ఉంటుంది’ అని మ్యాక్స్‌వెల్ అన్నాడు.
‘సూర్యకుమార్‌ని కొనేందుకు మా దగ్గర సరిపోను డబ్బు లేదు. ఒకవేళ అతడిని బిగ్‌బాష్‌లీగ్‌లో ఆడించాలంటే మా జట్టు కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లందరినీ తీసెయ్యాలి. అప్పుడుగానీ సూర్యను కొనడం సాధ్యం కాదు. అతను గ్యాప్‌లను వెతికి మరీ బౌండరీలు కొడతాడు. అందుకనే తక్కువ టైంలోనే టీ 20ల్లో ఉత్తమ బ్యాటర్‌గా ఎదిగాడు’ అని సూర్యపై మ్యాక్స్‌వెల్ ప్రశంసలు కురిపించాడు.
బిగ్ బాష్ లీగ్ అనేది ఆస్ట్రేలియాలో జరిగే టీ 20 లీగ్. గత ఏడాదికాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్య టీ 20ల్లో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఈమధ్యే న్యూజిలాండ్‌పై అతను రెండో టీ 20 సెంచరీ సాధించాడు. భారత క్రికెటర్లు ఇతర దేశాల లీగ్స్‌లో ఆడడంపై నిషేధం ఉంది. ఒకవేళ ఆడాలనుకుంటే వాళ్లు అన్నిఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ఆ నిషేధం గనుక లేకుంటే ఇతర లీగ్స్‌లోనూ మన క్రికెటర్స్‌కు భారీ ధర దక్కేది. 2023 ఐపీఎల్లో సూర్య ముంబై ఇండియన్స్, మాక్స్వెల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

